విశాలాంధ్ర పుట్టపర్తి:- రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పి 4 బంగారు కుటుంబాలు మార్గదర్శి కార్యక్రమంలో విజయవంతం చేయాలని కలెక్టర్ శ్యాంప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం పట్టణంలోని సాయి ఆరామంలో జరిగిన స్వర్ణాంధ్ర 2047 అమలుపై గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందికి శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న కలెక్టర్ మాట్లాడుతూ, పి 4 బంగారు కుటుంబాలు, మార్గదర్శి కార్యక్రమం ఎంతో గొప్ప ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. సమాజంలో ఆర్థిక అసమానతలు, గ్రామానికి సేవలు అందించడానికి ఈ మార్గదర్శి బంగారు కుటుంబాలు పి 4 కార్యక్రమం మంచి వేదికగా ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సచివాలయాల వార్డు ఉద్యోగులు మూల స్తంభం లాంటివారని, 45 రోజులలో బంగారు కుటుంబాలను మార్గదర్శలను గుర్తించాలని కోరారు. సమాజానికి ఏదో విధంగా సహాయ పడాలని మనస్సు కలిగిన వ్యక్తులు ఉంటారని వారి సహాయాన్ని ఈ కార్యక్రమానికి వినియోగించుకోవాలన్నారు. అలాంటి మార్గదర్శకులను గుర్తించి సమాజ అభివృద్ధికి మీ వంతు కృషి చేయాలని కలెక్టర్ కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రస్థాయి అధికారులు సందీప్, రాజశేఖర్, సిపిఓ విజయ్ కుమార్, జిల్లా వార్డు గ్రామ సచివాలయాల సిబ్బంది, శిక్షకులు పాల్గొన్నారు.
మార్గదర్శి,బంగారు కుటుంబాలను గుర్తించండి – కలెక్టర్ శ్యాం ప్రసాద్
- Advertisement -
RELATED ARTICLES


