విశాలాంధ్ర పెనుకొండ …కరువు నేలపై కరుణ చూపించిన ఆర్డిటి పై ఇంత వివక్షత అవసరమా అంటూ ప్రజలు గళం విప్పారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బహుజన చైతన్య వేదిక అధ్యక్షుడు, హైకోర్టు ప్రముఖ న్యాయవాది శివరామకృష్ణ, శనివారం ర్యాలీ నిర్వహించారు, , కరువు నేల అయిన రాయలసీమలో 50 సంవత్సరాల క్రితం నుండి పేద ఇంటి ప్రతి బిడ్డకు చదువు, పెళ్లిళ్లు, ఇల్లు, ఆరోగ్యం అంటూ వివిధ రకాలుగా సేవలు అందించిన ఆర్డిటిపై ఇంత వివక్షత ఎందుకు ప్రశ్నించారు, స్థానిక అంబేద్కర్ సర్కిల్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి అనంతరం దర్గా సర్కిల్, ఎస్ కే డి సర్కిల్, మడకశిర రోడ్, ఎన్టీఆర్ సర్కిల్ మీదుగా ర్యాలీ నిర్వహించి, అనంతరం స్థానిక ఆర్డిఓ కార్యాలయం ప్రాంగణంలో బైఠాయించి తమ నిరసన తెలియజేశారు, అనంతరం ఆర్డిఓ ఆనంద్ కుమార్ కు వినతి పత్రాన్ని సమర్పించారు,ఉమ్మడి అనంతపురం జిల్లాలో 14 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు, ముగ్గురు మంత్రులు ఉన్నా కూడా అసెంబ్లీ సమావేశాల్లో ఏ ఒక్కరు ఆర్ డి టి గురించి మాట్లాడలేదని, మా ఇంటి ఆడబిడ్డ పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి మాత్రమే ఆర్ డి టి ఘోషను అసెంబ్లీలో వినిపించారని, ఎన్నో వేల కుటుంబాలకు అండగా నిలబడిన ఆర్ డి టి కి కూటమి ప్రభుత్వం అండగా నిలబడి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఆర్డిటికీ ఉన్న సమస్యలు తొలగించాలన్నారు,బహుజన చైతన్య వేదిక అధ్యక్షుడు శివరామకృష్ణ మాట్లాడుతూ ప్రతి పేద ఇంటి కుటుంబానికి ఎంతో ఆసరాగా నిలబడి, మీకు మేమున్నాం అంటూ కొండంత ధైర్యం నింపిన ఆర్ డి టి కి నేడు ఎన్ని కష్టాలు రావడం దురదృష్టకరమన్నారు, సేవ్ ఆర్ డి టి అనే కార్యక్రమాన్ని బహుజన చైతన్య వేదిక ద్వారా మొదలుపెట్టామని, ఆర్ డి టి కి తమ వంతు తాము సహాయం అందిస్తామని, ఎన్నో వేల కుటుంబాలకు ప్రత్యక్ష దైవంగా నిలబడి, ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్న ఆర్డిటి మళ్లీ యధా స్థాయికి వచ్చేంతవరకు పోరాటాలు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ స్థాయి నుంచి పేద ప్రజలు బడుగు బలహీన వర్గాలు బహుజన చైతన్య వేదిక సభ్యులు పాల్గొన్నారు.
ఆర్డిటిని పరిరక్షించాలని కోరుతూ నిరసన ర్యాలీ
- Advertisement -
RELATED ARTICLES


