విశాలాంధ్ర పుట్టపర్తి: – వీఆర్ఏల సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు పేర్కొన్నారు. శనివారం ఆర్డీవో కార్యాలయం ముందు వీఆర్ఏలు ధర్నాకు ఏఐటియుసి మద్దతు పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దశాబ్ద కాలం నుంచి వీఆర్ఏల సమస్యలను పట్టించుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయన్నారు .ప్రభుత్వాలు మారుతున్న వీఆర్ఏల జీవితాలు ఏమాత్రం మారటం లేదని, ప్రధానంగా పే స్కేల్ ప్రకారం 21 వేల రూపాయలు వేతనం ఇవ్వాలని, కారుణ్య నియామకాల కింద మరణించిన వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలన్నారు.60 సంవత్సరాలు పైబడిన ఆరోగ్య రీత్యా ఉన్నటువంటి వీఆర్ఏల నామినీలకు వీఆర్ఏలాగా నియమించాలని అర్హత కలిగిన వీఆర్ఏలను ప్రమోషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు.రాష్ట్ర ప్రభుత్వంలో ఏమాత్రం చలనం లేదని ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం మాదిరిగా ఆంధ్రప్రదేశ్ లో కూడా పేస్కేల్ అమలు చేయాలన్నారు . ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఏల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పెద్దన్న,సత్య సాయి జిల్లా వీఆర్ఏల సంఘం జిల్లా అధ్యక్షులు గంగాద్రి, కార్యదర్శి పెద్దన్న , సిపిఐ నాయకులు వినోద్ షేక్షవలి తదితరులు పాల్గొన్నారు.
వీఆర్ఏల సమస్యలను పరిష్కరించండి.. ఏఐటీయూసీ
- Advertisement -
RELATED ARTICLES


