విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి
విశాలాంధ్ర – నల్లజర్ల( క్రైమ్ ) : తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం నల్లజర్ల మండలం పుల్లలపాడు కు చెందిన ఆరేపల్లి సోమరాజు(34) విద్యుత్ షాక్ తో అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన గురువారం చోటుచేసుకుంది నల్లజర్ల ఎస్సై దుర్గాప్రసాద్ తెలిపిన వివరాలు ప్రకారం నల్లజర్ల మండలం పుల్లలపాడు గ్రామానికి చెందిన సోమరాజు పామాయిల్ గెలలు కోసేందుకు ప్రకాశరావు పాలెం గ్రామ రైతు గద్దె సత్యనారాయణకు కూలికి వెళ్లాడు గెలలు కోస్తూ ఉండగా విద్యుత్తు వైర్లకు ఐరన్ పైపుకు ఉన్న కత్తి విద్యుత్ వైర్లకు తగిలి అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. మృతునికి భార్య మౌనిక ఇద్దరు కుమారులు ఉన్నారు నల్లజర్ల పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


