విశాలాంధ్ర – దేవరపల్లి : దేవరపల్లి జగద్గురు శ్రీశ్రీశ్రీ ఆదిశంకరాచార్య ధ్యాన మందిరంలో మార్గశిర మాసం పౌర్ణమి సందర్భంగా గురువారంనాడు సౌందర్యలహరి శివానందలహరి పారాయణం చేశారు ఈ సందర్భంగా ఒకే పానిపట్టంపై గల విఘ్నేశ్వరుడు ఆదిశంకరాచార్యులు మహాలక్ష్మి సరస్వతి అమ్మవార్లకు వివిధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు ముఖ్యంగా పాలు పెరుగు నెయ్యి పంచదార తేనె కొబ్బరి నీరు విభూది చందనం లతో అభిషేకాలు నిర్వహించారు ఈ సందర్భంగా జగద్గురు శ్రీశ్రీశ్రీ ఆది శంకరాచార్య ధ్యాన మందిరం అభివృద్ధి కమిటీ సభ్యులు సౌందర్యలహరి శివానందలహరి పారాయణ మహిళ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఈనెల 27వ తేదీన లక్ష హనుమాన్ చాలీసా కార్యక్రమం చేపడుతున్నామని తెలిపారు మాతాజీ రామ దాసి ఆధ్వర్యంలో 1, లక్ష హనుమాన్ చాలీసా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు ముందుగా 26వ తేదీన దేవరపల్లి జగద్గురు శ్రీశ్రీశ్రీ ఆదిశంకరాచార్య ధ్యాన మందిరంలో 11 మంది దంపతులతో పాటు మహిళలు ప్రముఖులతో వివిధ ద్రవ్యాలతో హనుమాన్ కు ఆదిశంకరాచార్యులకు అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు 27వ తేదీన దేవరపల్లిలో గల కరటూరి ఫంక్షన్ హాల్స్ లో లక్ష హనుమాన్ చాలీసా కార్యక్రమం చేపడతామని తెలిపారు ఈ కార్యక్రమానికి అతిథులు జ్యోతి ప్రజ్వలనకు గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు కొవ్వూరు ఆర్డీవో డాక్టర్ రాణి సుస్మిత కరుటూరి ఫంక్షన్ హాల్స్ అధినేత కరుటూరి ధనుంజయుడు దేవరపల్లి జగద్గురు శ్రీశ్రీశ్రీ ఆదిశంకరాచార్య ధ్యాన మందిరం అభివృద్ధి కమిటీ చైర్మన్ కమిటీ సభ్యులు దేవరపల్లి పుర ప్రముఖులు భక్తులు దాతలు పాల్గొన్నారు హనుమాన్ చాలీసా లక్షసార్లు పారాయణ చేయటానికి దేవరపల్లి గోపాలపురం నల్లజర్ల నిడదవోలు చాగల్లు కొవ్వూరు ఉభయగోదావరి జిల్లాల నుండి దాదాపు 1200 మంది మహిళలు హాజరవుతారని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆదిశంకరాచార్య ధ్యాన మందిరం మహిళ కమిటీ సభ్యు లు తదితరులు పాల్గొన్నారు
శివానందలహరి పారాయణం
- Advertisement -
RELATED ARTICLES


