భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలి
కొవ్వూరు – విశాలాంధ్ర : భవన నిర్మాణ బోర్డును తక్షణమే పునరుద్దించకపోతే హైకోర్టును ఆశ్రయిస్తామని పౌర హక్కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు హైకోర్టు అడ్వకేట్ నంబూరు శివన్నారాయణ అన్నారు . కొవ్వూరు ప్రైవేటు ఎలక్ట్రికల్ ప్లంబింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో గురువారం భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని “సభ” నిర్వహించారు. ఈ సభకి రోoగల హరీష్ కుమార్ అధ్యక్షత వహించారు. యూనియన్ ప్రెసిడెంట్ రొంగల హరీష్ మాట్లాడుతూ ఎలక్ట్రికల్ ప్లంబింగ్ వర్కర్స్ వెల్ఫేర్ యూనియన్ సభ్యులు అందరూ పోస్టల్, బ్యాంకు లలో కేంద్ర ప్రభుత్వ ఇన్సూరెన్స్ చేయించుకోవాలని కోరారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆంధ్ర ప్రదేశ్ ప్రగతిశీల భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.వి.రమణ మాట్లాడుతూ గత 6 సంవత్సరాలు గా భవన నిర్మాణ కార్మిక సంక్షేమ మండలి బోర్డు పధకాలను నిలుపుదల చేశారనీ తక్షణమే కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బోర్డు పునరుద్ధరించి, పెండింగ్ లో ఉన్న క్లైమ్ లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. డిసెంబర్15వ తారీఖున చలో కలెక్టరేట్ పిలుపు జయప్రదం చేయండి.* ఐ.యఫ్.టి.యు రాష్ట్ర కమిటీ సభ్యులు పి.నాగేశ్వరరావు, ప్రగతిశీల భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఈమని గ్రీష్మ కుమార్ లు మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం డిసెంబర్ 1 నుంచి 14 వరకూ ప్రచార ఆందోళన లు 15 న ఛలో కలెక్టరేట్ నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపు ఇచ్చారు. అనంతరం కార్మికులు కొవ్వూరు పట్టణ లో “బైక్ ర్యాలీ ” లేబర్ కమిషనర్ కార్యాలయం వరకు వరకు నిర్వహించినారు. అసిస్టెంట్ లేబర్ కమీషనర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. కార్యాల అధికారికి వినతి పత్రం అందజేశారు భవన నిర్మాణ బోర్డును తక్షణమే పునరుద్ధరించకపోతే హైకోర్టును ఆశ్రయిస్తాం*-పౌర హక్కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, హైకోర్టు అడ్వకేట్ నంబూరి శ్రీమన్నారాయణ ఈ ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల న్యాయమైన కోరికలను తక్షణం పరిష్కారం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బి వో సి బోర్డును పునరుద్ధరించకపోతే హైకోర్టును ఆశ్రయిస్తామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బి ఓ సి కార్మికులు జరుగుతున్న ఆందోళన కు పౌరహక్కుల సంఘం సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ గౌరవ సలహాదారు ఈమని మల్లిక, గౌరవ అధ్యక్షులు పద్దాల వెంకన్న, ప్రధాన కార్యదర్శి మరపట్ల శ్రీనివాస్, ఏపీ ప్రగతిశీల భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు కావూరి రాజేష్, ఉపాధ్యక్షులు, పెండ్యాల వీరబ్రహ్మం, శిరపరపు రామ శ్రీను, జాయింట్ సెక్రటరీ సిహెచ్ దానియేలు, గుండా బత్తుల రాజేష్ కోశాధికారి చిన్నప్ప శ్రీనివాస్, కొమ్ము రామకృష్ణ, నాయకులు నూకరాజు, అధిక సంఖ్యలో ఎలక్ట్రికల్ ప్లంబింగ్ కార్మికులు పాల్గొన్నారు.


