Homeఆంధ్రప్రదేశ్ప్రమాదాలను ఎదుర్కొనేలా ఎమ్మెల్యే ముప్పిడి

ప్రమాదాలను ఎదుర్కొనేలా ఎమ్మెల్యే ముప్పిడి

- Advertisement -

ప్రమాదాలను ఎదుర్కొనేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం….* ఎమ్మెల్యే ముప్పిడి

విశాలాంధ్ర – తాళ్లపూడి : భయంకరమైన మొంథా తుఫాన్ కారణంగా  ప్రజలకు గాని, మూగ జీవాలకు గాని, వర్షం, వరద నీటి ముంపు వంటి ఏ ప్రమాదకర సంఘటనలు జరగ కుండా  ఎన్డీయే కూటమి ప్రభుత్వం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ అధికారులను అప్రమత్తం చేస్తూ చర్యలు తీసుకుందని కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు. ఆయన మండలం లో ముందు జాగ్రత్తగా తీసుకున్న చర్యలు పరిశీలించేందుకు తాళ్లపూడి మండలానికి విచ్చేసారు. అన్నదేవరపేట రి-హెబిలేషన్ సెంటర్ ను, మెడికల్ కాంప్ ను గజ్జరం లో ఏటా వరద నీటి కోతకు గురయ్యే కొత్త చెరువును పరిశీలించారు. గట్టు కోతకు గురవ్వకుండా అధికారులు  ఇసుక బస్తాలు వేసిన సంగతి పరిశీలించారు. ఇరిగేషన్ చెరువు గురించి వివరాలు అడిగి తెలుసు కున్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజక వర్గం లోని మద్దూరు లంక ల్లో నివాసం వుండే కుటుంబాల ను పునరావాస కేంద్రాలకు తరలించామని తెలిపారు. ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా తక్షణం స్పందించే లా అన్ని శాఖల అధికారులను సిద్ధంగా ఉంచామని తెలిపారు. మొంథా తుఫాన్ కారణంగా విధ్యుత్ సరఫరాకు ఎటువంటి ఆటంకం కలగకుండా ముందస్తుగా ఇచ్చిన ఆదేశాల మేరకు విధ్యుత్ శాఖ అద్వర్యం లో చేసిన  ట్రాన్స్ఫార్మర్ లు తదితర ఏర్పాట్లు పరిశీలించేందుకు ప్రక్కిలంక  ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్ ను ఎమ్మెల్యే పరిశీలించారు. ఎమ్మెల్యే వెంట తాళ్లపూడి ఎంపీడీఓ వేణు గోపాల్రెడ్డి, విఆర్వో నాగేశ్వరరావు,  హైస్కూల్ ఎచ్.ఎం. మండల టీడీపీ నాయకులు సిద్ధ దుర్గారావు, కోటారు వెంకట్రావు, కుచిపూడి గణపతి, ముళ్ళపూడి రామచంద్రం, చేవ్వురి బంగార్రాజు, నామన పరమేశ్వరరావు, మండల బిజెపి నాయకులు గంటా కృష్ణ, మానవత అధ్యక్షులు వెలుగుబంటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. గజ్జరం గ్రామాం లో అధికారులు చేసిన ఏర్పాట్లను పరిశీలించేందుకు వచ్చిన ఎమ్మెల్యే ముప్పిడి తో పాటు కాకర్ల వంశీ, ఉప సర్పంచ్ దండమూడి శేషు, కొర్లపాటి దత్తుడు తదితర నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు