Homeజిల్లాలువిజయనగరంఅన్న క్యాంటీన్‌ను తనిఖీ చేసిన మున్సిపల్ కమిషనర్

అన్న క్యాంటీన్‌ను తనిఖీ చేసిన మున్సిపల్ కమిషనర్

- Advertisement -

విశాలాంధ్ర-రాజాం (విజయనగరం జిల్లా) : రాజాం ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలోని అన్న క్యాంటీన్‌ను మున్సిపల్ కమిషనర్ ఏ. రామచంద్రరావు శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా క్యాంటీన్‌కు అల్పాహారం కోసం వచ్చిన ప్రజలతో నేరుగా మాట్లాడి, అందిస్తున్న ఆహార నాణ్యత, రుచి, శుభ్రతపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. కొన్ని సందర్భాల్లో క్యాంటీన్ సిబ్బంది భోజనం కోసం వచ్చిన వారితో దురుసుగా వ్యవహరిస్తున్నారని తన దృష్టికి వచ్చిందని కమిషనర్ తెలిపారు. ఇలాంటి ప్రవర్తన పునరావృతమైతే కఠిన చర్యలు తప్పవని సిబ్బందిని హెచ్చరించారు. ప్రజలతో మర్యాదగా, బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు. క్యాంటీన్‌లో ఆహార పదార్థాల నాణ్యతను స్వయంగా పరిశీలించిన కమిషనర్, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అందరికీ సమయానికి ఆహారం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే క్యాంటీన్ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు శుభ్రతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని సిబ్బందికి సూచించారు.ప్రజలకు ఉపయోగపడే అన్న క్యాంటీన్ సేవలు మరింత మెరుగ్గా అందేలా అధికారులు, సిబ్బంది సమన్వయంతో పని చేయాలని ఆయన పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు