విశాలాంధ్ర-రాజాం(విజయనగరం జిల్లా) : రాజాం పురపాలక సంఘం పరిధిలోని తెలగవీధికి చెందిన నాయి బ్రాహ్మణ సోదరుడు చెల్లూరి శ్రీను వాసురావు ప్రమాదవశాత్తు కాలు విరగడంతో ప్రస్తుతం హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న రాజాం నాయి బ్రాహ్మణ సంఘం సభ్యులు ఆయనను ఆసుపత్రిలో పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సంఘం తరపున బాధితుడికి ఆర్థిక సహాయం అందజేశారు. ఇలాంటి కష్టకాలంలో సంఘం సభ్యులంతా ఐక్యంగా నిలబడి సహకారం అందించడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు పసుపురెడ్డి వెంకటరమణ, ఉపాధ్యక్షులు కోమటిగిరి వెంకన్న, నేలతూరి అప్పారావు, కార్యదర్శి కొండేటి దుర్గారావు, ఉప కార్యదర్శి ఆచంట గణేషు, కోశాధికారి తాతపూడి సూర్యనారాయణతో పాటు ఇతర సంఘ సభ్యులు పాల్గొన్నారు. చెల్లూరి శ్రీను వాసురావు త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని సంఘం సభ్యులు ఆకాంక్షించారు.


