ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగ నియామకాలలో స్థానికత,జోనల్ విధానాల్లో తాజా మార్పులు కేంద్ర ప్రభుత్వం చేపట్టింది.1975 లో విడుదలైన పబ్లిక్ ఎంప్లాయ్‌మెంట్ ఆర్డర్‌ను సవరించడం ద్వారా ఈ మార్పులు అమలు అయ్యాయి.ఈ ఆర్డర్‌నుఁఆర్గనైజేషన్ ఆఫ్ లోకల్ కేడర్స్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ఁగా పిలుస్తారు.సవరణలో కేంద్రప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లోని 26జిల్లాలను ఆరు జోన్లుగా విభజించింది.ఆరు జోన్లను అదనంగా రెండు మల్టీ జోన్లుగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధానం గురించి సంబంధిత గెజిట్ నోటిఫికేషన్ ద్వారా అధికారికంగా ప్రకటించబడింది.కొత్త మార్పుల వల్ల ప్రత్యక్ష నియామకాలలో స్థానిక కేడర్,జోనల్,మల్టీ జోనల్ విధానాలపై స్పష్టత ఏర్పడింది.ఇకపై ఒకే ప్రాంతంలో కనీసం 7సంవత్సరాల పాటు చదివినవారిని స్థానికులుగా పరిగణిస్తారు.
రాష్ట్రంలో నాలుగు జోన్ల వ్యవస్థ
రాష్ట్రంలో ఇప్పటివరకు నాలుగు జోన్ల విధానం ఉన్నప్పటికీ, 26 జిల్లాల పునర్వ్యవస్థీకరణ తర్వాత కొత్త జోనల్ నియమాలు అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యానుసారం కేంద్రం గెజిట్ నోటిఫికేషన్‌ను జారీ చేసింది.
మల్టీ జోన్-1 వివరాలు:
జోన్-1: శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, విశాఖపట్నం, అనకాపల్లి, మన్యం
జోన్-2: అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ
జోన్-3: పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్
మల్టీ జోన్-2:
జోన్-4: గుంటూరు, పల్నాడు, ప్రకాశం, బాపట్ల
జోన్-5: వైఎస్సార్ కడప, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య
జోన్-6: అనంతపురం, కర్నూలు, శ్రీ సత్యసాయి, నంద్యాల
ఈ మార్పులు రాష్ట్ర యువతకు మేలు
కొత్త జోనల్ విధానం అమలు అయ్యాక, ప్రభుత్వ ఉద్యోగ నియామకాలలో స్థానికులకు మరింత ప్రాధాన్యం లభిస్తుంది.కేంద్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగాల పంపిణీ సమానంగా ఉండేలా చూస్తుంది.
ముఖ్యంగా రాయలసీమ,ఉత్తరాంధ్ర ప్రాంతాలలో ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని అంచనా.
గెజిట్ నోటిఫికేషన్‌లో వివరించిన నిబంధనల ప్రకారం,భవిష్యత్తులో కొత్త నియామకాలు ఈ విధానంతో జరుగుతాయి.నిపుణుల అభిప్రాయం ప్రకారం,ఈ మార్పులు రాష్ట్ర యువతకు మేలు చేస్తాయి.
పాత జోనల్ వ్యవస్థలో కొన్ని ప్రాంతాలు అవకాశాల పరంగా నష్టపోతున్నాయని ఫిర్యాదులు ఉన్నాయి.
కొత్త వ్యవస్థ ద్వారా సమానత్వం మరియు న్యాయం ఖాయమవుతుంది.రాష్ట్రప్రభుత్వం కూడా ఈ మార్పును స్వాగతిస్తూ,త్వరలో సంబంధిత జీవోలు జారీ చేయనుంది.భవిష్యత్తులో ఉద్యోగనియామక నోటిఫికేషన్లలో ఈ కొత్త జోనల్ నియమాలు అమలు చేయబడతాయి.


