Homeఆంధ్రప్రదేశ్అభివృద్ధి బాటలో నిడదవోలు నియోజకవర్గం

అభివృద్ధి బాటలో నిడదవోలు నియోజకవర్గం

- Advertisement -

*16 నెలల కాలంలో నిడదవోలులో చేపట్టిన అభివృద్ధి పనులు*

విశాలాంధ్ర – నిడదవోలు : నిడదవోలు నియోజకవర్గ ప్రజలు మంత్రి కందుల దుర్గేష్ పై విశ్వాసముంచి ఎమ్మెల్యేగా గెలిపించడం, అనంతరం రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రిగా వచ్చిన అవకాశంతో నిడదవోలు సమగ్రాభివృద్ధికి శ్రీకారం చుట్టారు. దాంతో నిడదవోలు నియోజకవర్గం అభివృద్ధి వైపు వేగంగా అడుగులు వేస్తుంది. ఎమ్మెల్యేగా, మంత్రిగా పదవిని చేపట్టి 16 నెలలు కావస్తున్నా తరుణంలో ఆయన చేసిన అభివృద్ధి పనులను వివరించారు.

*ప్రజా సేవకుడిగా రూ.400 కోట్లతో సమగ్రాభివృధ్ధి దిశగా నిడదవోలు* ప్రజలకు సేవకుడిగా పనిచేస్తున్న మంత్రి కందుల దుర్గేష్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో కేవలం 16 నెలల కాలంలోనే రూ. 400 కోట్లతో నిడదవోలు నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నారు.

*ఐదేళ్ల నరకపు దారులకు ఏడాది కాలంలో మోక్షం*.. *రోడ్ల నిర్మాణాలకు నిధుల మంజూరులో తనదైన మార్క్ చూపించిన మంత్రి కందుల దుర్గేష్* • గత ప్రభుత్వం ఏనాడూ అభివృద్ధిపై దృష్టి సారించిన దాఖలాలు లేవు. నియోజకవర్గంలో రోడ్లు నరకానికి మార్గాలుగా మారి అధ్వాన్న స్థితికి చేరుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం సీఎం చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మాత్యులు పవన్ కళ్యాణ్, ఆర్ అండ్ బీ మంత్రి బి.సీ జనార్ధన్ రెడ్డిలతో నియోజకవర్గ అభివృద్ధి కోసం రహదారులు కేటాయించాలని మంత్రి కందుల దుర్గష్ విజ్ఞప్తి చేసి పలు రోడ్ల నిర్మాణాలకు నిధులు మంజూరు చేయించారు.

*నాడు రోడ్లు అధ్వాన్నం.. ప్రయాణం నిదానం*..
*నేడు రోడ్లు అద్భుతం.. ప్రయాణం సురక్షితం*: • నాడు కనీసం రోడ్డు నిర్మాణానికి తట్టెడు మట్టి కూడా వేయకుండా, కనీస మరమ్మతులు చేయకుండా గత ప్రభుత్వం వాహనదారులను ఇబ్బంది పెడితే మంత్రి కందుల దుర్గేష్  ప్రత్యేక చొరవ తీసుకొని అనతి కాలంలోనే వాహనదారుల సురక్షిత ప్రయాణానికి మార్గం సుగమం చేశారు. త్వరలోనే నియోజకవర్గంలోని అన్ని రోడ్లు పూర్తై ప్రయాణీకులు సాఫీగా ప్రయాణం చేసేందుకు మంత్రి కందుల దుర్గేష్  చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే కొన్ని రోడ్ల నిర్మాణాలు ప్రారంభం కాగా త్వరలోనే మరిన్ని రోడ్లు ప్రారంభానికి నోచుకోనున్నాయి. రాబోయే రోజుల్లో పంచాయతీ రాజ్ శాఖ ద్వారా నియోజకవర్గానికి మరిన్ని నిధులు తీసుకొచ్చి మరిన్ని రోడ్ల నిర్మాణం చేపట్టేందుకు ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు.

*రూ.105 కోట్లతో నిడదవోలు పట్టణ సమగ్రాభివృద్ధికి మంత్రి కందుల దుర్గేష్ బాటలు*:

• మంత్రి కందుల దుర్గేష్ కృషితో ఒక్క నిడదవోలు పట్టణంలోనే రూ. 105.80 కోట్ల నిధులతో ప్రజానీకానికి ఉపయోగపడే అభివృద్ధి పనులు చేపట్టారు. అందులో మున్సిపాలిటీ సాధారణ నిధుల నుండి రూ.15.75 కోట్లతో 240 అభివృద్ధి పనులు ప్రారంభించగా  రూ.8.12 కోట్లతో ఇప్పటికే 187 పనులు పూర్తిచేశారు. మిగిలిన పనులు పురోగతిలో ఉన్నాయి.

*నిడదవోలు నియోజకవర్గంలో దాదాపు రూ.50 కోట్లతో రహదారుల నిర్మాణం*: • రహదారులు అభివృద్ధికి చిహ్నాలు అని విశ్వసించిన మంత్రి కందుల దుర్గేష్ నిడదవోలు నియోజకవర్గంలో ఆర్ అండ్ బీ క్రింద దాదాపు రూ.23.10 కోట్లతో నిర్మాణ పనులు చేపట్టడం జరిగింది. ఇందులో నాబార్డ్ నిధులు 5.10 కోట్లు, స్టేట్ గ్రాంట్ రూ.15.50 కోట్లు, ప్యాచ్ వర్క్ ల్లో అన్ని రకాల రోడ్లకు కలిపి రూ.2.50 కోట్లు మంజూరు చేయించారు. అందులో భాగంగా చేపట్టిన రోడ్ల వివరాలు పరిశీలిస్తే • రూ.4.20 కోట్లతో కానూరు – లంకలకోడూరు • రూ.4.15 కోట్లతో కానూరు – గోపవరం, ముక్కామల సెంటర్ తూం వరకు • రూ.4.15 కోట్లతో దువ్వ – తేతలి రోడ్డు • నాబార్డు క్రింద  రూ. 3.24 కోట్లతో వడ్లూరు – తీపర్రు రోడ్డు • రూ.1.26 కోట్లతో ఎర్రచెరువు – పిట్ల వేమవరం  రోడ్డు • రూ.60 లక్షలతో తేతలి – మునిపల్లి రోడ్డు • మార్టేరు- ప్రక్కిలంక రహదారిలో కానూరు – ఉసులుమర్రు మధ్యలో రూ.300 లక్షలతో సిమెంట్ రోడ్డు • కానూరు దగ్గర 47 లక్షలతో కల్వర్టు నిర్మాణం చేపట్టడం జరిగింది.

*గుంతల రహిత ఆంధ్రప్రదేశ్..సాఫీగా ప్రయాణం చేసేందుకు మార్గం చూపిన దుర్గేష్*: • ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గుంతల రహిత ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం క్రింద నిడదవోలు నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లో పాత్ హోల్ వర్క్స్ చేపట్టి ప్యాచ్ వర్క్ లు పూర్తి చేయించారు మంత్రి కందుల దుర్గేష్. ప్రధానంగా పెరవలి – నిడదవోలు వరకు, నిడదవోలు – ఉండ్రాజవరం వరకు పనులు చేపట్టారు. అక్కడక్కడా వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాల్లో మళ్లీ పనులు మొదలుపెట్టడం జరిగింది. అవి కూడా శరవేగంగా జరుగుతున్నాయి.

*మంత్రి కందుల దుర్గేష్ నేతృత్వంలో పల్లె పరవశించేలా  గ్రామీణ రోడ్లకు మహర్ధశ* *రూ.11.20 కోట్లతో పల్లె పండుగ కార్యక్రమం క్రింద రహదారులు నిర్మాణం* : • మంత్రి కందుల దుర్గేష్ ప్రత్యేక చొరవతో నిడదవోలు నియోజకవర్గంలో పల్లె పండుగ కార్యక్రమం క్రింద రూ.11.20 కోట్లతో 23.8 కి.మీల మేర 181 పనులు చేపట్టారు.  తద్వారా గ్రామీణ రోడ్లకు మహర్దశ వచ్చింది. • అందులో నిడదవోలు మండలంలో రూ. 439.93 లక్షలతో 85 పనులు చేపట్టగా   రూ.290.11 లక్షలతో 8.7 కి.మీల మేర 81 పనులు పూర్తి అయ్యాయి. • ఉండ్రాజవరం మండలంలో రూ. 300.7 లక్షలతో 57 పనులు చేపట్టగా   రూ. 233.12  లక్షలతో 6.9 కి.మీల మేర 55 పనులు పూర్తి అయ్యాయి. • పెరవలి మండలంలో రూ. 380.7 లక్షలతో 39 పనులు చేపట్టగా  రూ. 274  లక్షలతో 8.25 కి.మీల మేర 38 పనులు పూర్తి అయ్యాయి.

*నిడదవోలులో నాబార్డు గ్రాంట్ క్రింద చేపట్టిన పనులు* • నిడదవోలులో నాబార్డ్ గ్రాంట్ క్రింద రూ.17 కోట్ల అంచనా వ్యయంతో 4 పనులు మంజూరు అయ్యాయి. • అందులో పంచాయతీ రాజ్ -ఇంజినీరింగ్ డిపార్ట్ మెంట్ క్రింద  రూ.7.37 కోట్లతో రహదారి నిర్మాణ పనులు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నాయి. • ఇటీవల జాతీయ రహదారి 16 నుండి కొత్తపల్లి అగ్రహారం మీదుగా కాపవరం పోవు దారికి రూ.  1.70 కోట్లతో శంకుస్థాపన చేయడం జరిగింది. • మరో రూ.5.67 కోట్లతో 3 రహదారి నిర్మాణ పనులు ప్రారంభించడానికి, శంకుస్థాపన చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే ఆయా పనులకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ, అగ్రిమెంట్లు పూర్తయ్యాయి. • వాటిలో రూ.1.50 కోట్లతో కానూరు నుండి నడిపల్లి కోట వరకు, రూ.1.45 కోట్లతో సింగవరం నుండి నందమూరు, తాళ్లపాలెం మీదుగా నిడదవోలు మండలం వరకు,  రూ.2.69 కోట్లతో ఉండ్రాజవరం మండలంలోని పైడిపర్రు నుండి సత్యవాడకు వెళ్లే  రహదారుల నిర్మాణం చేపట్టాల్సి ఉంది. • ఆంధ్రప్రదేశ్ రూరల్ రోడ్డు ప్రాజెక్టు (ఏపీఆర్ఆర్ పీ) ద్వారా  ఏఐఐబీ బ్యాంక్  నిధుల నుండి రూ.9.28 కోట్ల నిధులతో 16 పనులు 27.8 కి.మీల మేర రహదారుల నిర్మాణం పూర్తి చేశాం. • ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన (పీఎంజీఎస్ వై) నిధులతో తేతలి -మునిపల్లి రోడ్డు నుండి చిలకపాడు మీదుగా ఉండ్రాజవరం వరకు 6.2 కి.మీల పొడవుగల రహదారిని రూ.4.16 కోట్ల అంచనా వ్యయంతో పూర్తి చేయడం జరిగింది.

*ఎంపీ ల్యాడ్స్, మంత్రి  కోటాలో ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో నిడదవోలు నియోజకవర్గం అభివృధ్ధికి చర్యలు* • మంత్రి కందుల దుర్గేష్  కోటాలో నిడదవోలు నియోజకవర్గంలో  మొత్తంగా రూ.21.28 కోట్లతో 214 పనులు మంజూరు అయ్యాయి. ఇందులో రూ.7.5 కోట్లతో మండలానికి రూ.2.5 కోట్ల చొప్పున నిధులు ఖర్చు చేస్తూ అభివృద్ధి పనులు చేపట్టారు. • అందులో భాగంగా నిడదవోలులో రూ. 729.45 లక్షలతో  59 పనులు,  ఉండ్రాజవరంలో  రూ. 738.3 లక్షలతో 99 పనులు, పెరవలిలో రూ. 660.7 లక్షలతో  – 56 పనులు చేపట్టాలని నిర్ణయించాం. • ఎంపీఎన్ఆర్ఈజీఎస్ క్రింద  35 పనులు మంజూరు అయ్యాయి.  అందులో  ఉండ్రాజవరంలో  రూ. 171.5 లక్షలతో 10 పనులు, పెరవలిలో రూ. 197.9 లక్షలతో 17 పనులు, నిడదవోలులో రూ. 196 లక్షలతో  8 పనులు చేపట్టాల్సి ఉంది. • జెడ్పీ నిధులతో ఉండ్రాజవరం మండలంలో వెలగదుర్రు గ్రామంలో అసంపూర్తిగా ఉన్న డ్వాక్రా బిల్డింగ్ నిర్మాణం రూ.10 లక్షలతో చేపట్టాం..పెరవలిలో రూ.25 లక్షలతో 4 పనులు గ్రౌండింగ్ అయ్యాయి. నిడదవోలులోని కంసాలి పాలెంలో 15 లక్షలతో 2 పనులు మొదలుపెట్టాం. బరియల్ గ్రౌండ్ కాంపౌండ్ వాల్ పూర్తయింది. నిడదవోలు మండలంలోని డి. ముప్పవరం గ్రామంలో అసంపూర్తిగా ఉన్న డ్వాక్రా బిల్డింగ్ నిర్మాణానికి రూ.10 లక్షలు మంజూరు చేశాం. పనులు పురోగతిలో ఉన్నాయి. • ఎంపీ ల్యాడ్స్ ద్వారా ఉండ్రాజవరంలో 90 లక్షలతో 3 పనులు, పెరవలిలో  40 లక్షలతో 2 పనులు, నిడదవోలులో  90 లక్షలతో 3 పనులు చేపట్టాం. • ఇప్పటివరకు నిడదవోలు నియోజకవర్గంలోని నిడదవోలు మండలంలో ఎంపీ ల్యాడ్స్, జెడ్పీ గ్రాంట్, ఎన్ఆర్ఈజీఎస్ క్రింద చేపట్టిన  పనులు పూర్తయ్యే దశలో ఉన్నాయి.

*ఫలించిన మంత్రి కందుల దుర్గేష్ కృషి* –
*నియోజకవర్గంలో ఇంటింటికీ మంచి నీరు అందించేందకు చేసిన ప్రయత్నాలు సక్సెస్*
*రూ.130 కోట్లతో గ్రామీణ నీటి సరఫరా*: • నిడదవోలులో ఆర్ డబ్ల్యూఎస్ ద్వారా జల్ జీవన్ మిషన్ క్రింద రూ.64 కోట్లతో 97 పనులు పురోగతిలో ఉన్నాయి. • రూ.1400 కోట్లకు గానూ రూ.60 కోట్లతో విజ్జేశ్వరం నుండి నీటిని డ్రా చేసి వాటర్ గ్రిడ్ పథకం క్రింద నిడదవోలులోని  అన్ని గ్రామాలకు, అన్ని గ్రామాల్లోని  ప్రతి ఇంటికి కలుషితం కాని మంచి నీరు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకున్నాం. ఇప్పటికే మెగా కంపెనీతో ఒప్పందం పూర్తయింది.  వచ్చే నెలలో పనులు మొదలు పెడతాం. • రూ. 5.71 కోట్ల డిస్ట్రిక్ మినరల్ ఫండ్స్ తో (డీఎంఎఫ్)  27 డ్రెయిన్ వర్క్ లు ప్రారంభమయ్యాయి. టెండర్లు పూర్తి అయ్యాయి. ఈ నెలలో పనులు మొదలుపెడతాం.

*ఇతర అభివృద్ధి కార్యక్రమాలు*: • రూ.1.14 కోట్లతో 113 మినీ గోకులాలు ఏర్పాటు చేశాం

*నిడదవోలు నియోజకవర్గంలో రూ.50 కోట్లతో రహదారుల అభివృద్ధికి ప్రతిపాదనలు*:

• యర్నగూడెం నుండి కోటసత్తెమ్మ తల్లి దేవాలయం వరకు రూ. 27 కోట్లతో నాలుగు లైన్ల రహదారి విస్తరణ పనులకు ప్రతిపాదనలు. • పెరవలి నుండి నిడదవోలు వరకు ప్రధాన రహదారి నిర్మాణం పూర్తి చేసేందుకు ప్రతిపాదనలు. • కానూరు నుండి లంకలగూడెం వరకు ఇప్పటికే రూ. 4. 20 కోట్లు మంజూరు అయ్యాయి. మరో రూ. 6 కోట్ల ప్రతిపాదనలు పెట్టాం. • చిన్న కాశిరేవు బ్రిడ్జికి 5.50 కోట్లతో ప్రతిపాదన • నియోజకవర్గంలో అక్కడక్కడా డ్యామేజ్ అయిన రోడ్లు ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేసేందుకు రూ.5 కోట్లతో ప్రతిపాదనలు పెట్టాం.

*రూ.3 కోట్లతో పర్యాటక కేంద్రంగా నిడదవోలు:* • పర్యాటక మంత్రిగా వచ్చిన అవకాశంతో మంత్రి కందుల దుర్గేష్ అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టులో నిడదవోలును అంతర్భాగం చేసి రూ.3 కోట్లతో పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతున్నారు. • విశిష్టమైన చారిత్రక నేపథ్యం కలిగి, అద్భుతమైన ప్రాకారాలు, ఆకట్టుకునే ముఖ ద్వారం, ఎత్తైన రాజగోపురంతో తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెంలో అలరారుతున్న ప్రముఖ మహిమాన్విత ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ కోట సత్తమ్మ దేవాలయంలో అఖండ గోదావరి ప్రాజెక్టులో భాగంగా అదనపు యాత్రికుల వసతి గృహాలు ఏర్పాటుకు సంకల్పించారు. ఆలయ రాజగోపురం ఆధునికీకరణకు చర్యలు తీసుకుంటున్నారు. • ఏటా రూ.2 కోట్ల ఆదాయం, పుష్కలంగా భూమి లభ్యత ఉన్న కోట సత్తెమ్మ ఆలయాన్ని అఖండ గోదావరి ప్రాజెక్టులో భాగంగా కాలువ కట్టతో పాటు బోటింగ్ ఏర్పాటు చేసి మరింత అందంగా తీర్చిదిద్దనున్నారు. లక్షలాది మంది భక్తుల పాలిట కొంగు బంగారంగా నిలిచి శంఖు చక్ర గధ అభయ హస్త యజ్ఞోపవీతధారిణిగా ఏకశిలా స్వయం భూవిగ్రహంతో అలరారుతున్న త్రిశక్తి స్వరూపిణి కోట సత్తెమ్మ తల్లి ఆలయంలో  ఆధ్యాత్మికతను మెరుగుపరించేందుకు ఆలయ ఆవరణాన్ని అభివృద్ధి చేసి ఆలయంలో అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించేందుకు కంకణం కట్టుకున్నారు.  సాంస్కృతిక ప్రదేశంగా తీర్చిదిద్ది దూర ప్రాంత యాత్రికులను సైతం ఆకర్షించి పర్యాటకుల సంఖ్యను పెంచేందుకు కృషి చేసి ఆలయ అభివృద్ధికి తనదైన శైలిలో పాటుపడుతున్నారు.

*నిడదవోలును మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుందకు మంత్రి కందుల దుర్గేష్ చర్యలు*

కేంద్ర ప్రభుత్వ వికసిత్‌ భారత్‌-2047 లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్ర, జిల్లాల సత్వర అభివృద్ధి కోసం స్వర్ణాంధ్ర-2047 పేరుతో దార్శనిక పత్రాన్ని రూపొందించిన రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం, ఇప్పుడు అసెంబ్లీ నియోజకవర్గం వారీగా అభివృద్ధి సాధనకు దార్శనిక పత్రాలను రూపొందించాలని సంకల్పించింది. ఈ నేపథ్యంలో నిడదవోలును మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుందకు మంత్రి కందుల దుర్గేష్ చర్యలు చేపట్టారు. ఇప్పటికే నియోజకవర్గం పరిధిలో అందుబాటులో ఉన్న వనరులను వినియోగించుకొని, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధుల సమన్వయంతో దీర్ఘకాలిక, స్వల్పకాలిక అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేసి అమలు చేసే దిశగా ముందుకు సాగుతున్నారు.త్వరలోనే నియోజకవర్గంలో మరింత అభివృద్ధి చూస్తారని మంత్రి కందుల దుర్గేష్ ఘంటాపథంగా చెప్పారు. అభివృద్ధికి సహకరించిన కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు మంత్రి కందుల దుర్గేష్ ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు