రోటరీ క్లబ్ అధ్యక్షులు నాగభూషణ
విశాలాంధ్ర ధర్మవరం;; పేద ప్రజలకు కంటి వెలుగును ప్రసాదించడమే మా లక్ష్యము అని రోటరీ క్లబ్ అధ్యక్షుడు నాగభూషణ పేర్కొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల లో (వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా) ఉచిత కంటి ఆపరేషన్ల వైద్య శిబిరమును నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ శిబిరం రోటరీ క్లబ్, శంకరా కంటి ఆసుపత్రి బెంగళూరు, జిల్లా అంతత్వ నివారణ సంస్థ వారి సహకారంతో నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ శిబిరానికి దాతగా కీర్తిశేషులు కోరా రామ సుబ్బారెడ్డి తమ్ముడు కూర రామిరెడ్డి వారి కుటుంబ సభ్యులు వ్యవహరించడం పట్ల వారు కృతజ్ఞతలను తెలియజేశారు. ఈ శిబిరానికి దాతగా వ్యవహరించినందుకు వారిని ప్రత్యేకంగా సన్మానించడం జరిగిందని తెలిపారు. ఈ శిబిరానికి 110 మంది కంటి రోగులు పాల్గొనిగా వారికి శంకరా కంటి ఆసుపత్రి కంటి డాక్టర్ అబీద్ వైద్య చికిత్సలు అందించగా 75 మంది కంటి ఆపరేషన్లకు ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు. కంటి ఆపరేషన్ కు ఎంపికైన వారికి ఉచిత రవాణా, ఉచిత వసతి, ఉచిత భోజనం, ఉచిత ఆపరేషన్లు నిర్వహించబడునని తెలిపారు. అదేవిధంగా కంటి నిపుణులు సలహాలతో కళ్ళలలో ఉచిత లెన్స్ కూడా అమర్చబడునని తెలిపారు. ఆపరేషన్ అనంతరం ఉచితంగా అద్దాలు కూడా పంపిణీ చేయబడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ కోశాధికారి నరేందర్ రెడ్డి, క్యాంపు చైర్మన్ దాస్, సాంస్కృతిక మండలి అధ్యక్షులు సత్రశాల ప్రసన్నకుమార్, గర్రె రమేష్ బాబు, శ్రీనివాస్ రెడ్డి, జయసింహ, శివయ్య, సుదర్శన్ గుప్తా తో పాటు శంకరా కంటి ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.


