Wednesday, January 21, 2026
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిప్రజల ఫిర్యాదుల పరిష్కారమే మా లక్ష్యం.. ఆర్డీవో మహేష్

ప్రజల ఫిర్యాదుల పరిష్కారమే మా లక్ష్యం.. ఆర్డీవో మహేష్

- Advertisement -

విశాలాంధ్ర ధర్మవరం;; ప్రజల ఫిర్యాదుల పరిష్కారమే మా లక్ష్యము అని, ఇందుకు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి సోమవారం ఆర్డిఓ కార్యాలయంలో డివిజన్ పరిధిలోని ఏడు మండలాలలో గల ప్రజల యొక్క సమస్యలను ఫిర్యాదుల ద్వారా స్వీకరించి పరిష్కరించేందుకు తమ కృషి చేస్తున్నామని ఆర్డిఓ మహేష్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్డీవో కార్యాలయంలో ఆర్ఓఆర్ కింద 04, దరఖాస్తులు, హౌస్ సైట్ 01, పత్తివే డిస్ట్రిబ్యూట్ 2, ప్రభుత్వ భూముల ఫిర్యాదులు ఒకటి, ఎయిర్క్రోచ్మెంట్ గవర్నమెంట్ ల్యాండ్స్ ఒకటి, యాక్సిడెంట్ వేరియేషన్ ఒకటి మొత్తం పది రావడం జరిగిందని తెలిపారు. అదే డివిజన్ పరిధిలో బత్తలపల్లి, చెన్నై కొత్తపల్లి ఆర్ఓఆర్లు రెండు, ధర్మవరంలో పత్తి డిస్ట్రిబ్యూట్, ఆర్ఓఆర్, ఎంకరోజ్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ అండ్, అలాట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ల్యాండ్ అండ్ హౌస్ సైట్ వి 06, ముదిగుబ్బ పాతవే డిస్టిబూట్ 2, కనగానపల్లి, రామగిరి, తాడిమర్రి మండలాలలో 0 మొత్తం మెరిసి 10 రావడం జరిగిందన్నారు. ఈ ఫిర్యాదుల దరఖాస్తుల మేరకు వెనివెంటనే విచారణ జరిపి పరిష్కరించే విధంగా తాము తెలుపున గడువు తేదీ లోపల చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బందితోపాటు ఆయా మండలాల తాసిల్దార్లు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు