Homeజిల్లాలుఅనంతపురంనిజాయితీ, నిబద్ధతకు మరో పేరు కౌలుట్లయ్య

నిజాయితీ, నిబద్ధతకు మరో పేరు కౌలుట్లయ్య

- Advertisement -

సీఐ సేవలను కొనియాడుతున్న శింగనమల ప్రజలు…

విశాలాంధ్ర-నార్పల:శింగనమల పోలీస్‌ స్టేషన్‌లో సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ (సీఐ)గా విధులు నిర్వహించిన కౌలుట్లయ్య తన నిజాయితీ, నిష్పక్షపాత వైఖరి, ప్రజలకు అందుబాటులో ఉండే స్వభావంతో ప్రత్యేక గుర్తింపు పొందారు. విధి నిర్వహణలో ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా చట్టాన్ని అందరికీ సమానంగా అమలు చేస్తూ శాంతిభద్రతల పరిరక్షణలో కీలక పాత్ర పోషించారని స్థానికులు ప్రశంసిస్తున్నారు.ప్రజా సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ ప్రాధాన్యతనిస్తూ, వివాదాల పరిష్కారంలో న్యాయబద్ధమైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ఆయన ప్రజల విశ్వాసాన్ని చూరగొన్నారు. శింగనమల, నార్పల, గార్లదిన్నె మండలాల్లో శాంతిభద్రతలను బలోపేతం చేయడమే కాకుండా, పోలీసుల పట్ల ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించేందుకు విశేషంగా కృషి చేశారని పలువురు అభిప్రాయపడ్డారు.ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ, ఫిర్యాదులు స్వీకరించడంలో వేగంగా స్పందించడం, బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు చేపట్టడం ఆయన ప్రత్యేకతగా నిలిచిందని స్థానికులు పేర్కొంటున్నారు. 3 మండలాల్లో నెలకొనే చిన్నచిన్న వివాదాలను సైతం సామరస్యపూర్వకంగా పరిష్కరించి, కోర్టుల వరకు వెళ్లకుండా రాజీ మార్గాలను సూచించడం ద్వారా ప్రజల మన్ననలు పొందారు. యువతలో చట్టాలపై అవగాహన కల్పించడం, నేరాల నివారణపై ప్రత్యేక దృష్టి సారించడం ద్వారా సమాజంలో భద్రతా భావన పెంపొందించేందుకు కృషి చేశారు.అదేవిధంగా మహిళల భద్రత, బాలల సంక్షేమం, రోడ్డు భద్రత వంటి అంశాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చారు.ఇటీవల పోలీస్‌ శాఖ చేపట్టిన పరిపాలనా నిర్ణయాల నేపథ్యంలో కౌలుట్లయ్య శింగనమలలోని తన బాధ్యతల నుంచి తప్పుకోనున్నారనే విషయం తెలిసిన వెంటనే ప్రజలు, ప్రజాప్రతినిధులు, వివిధ వర్గాల నాయకులు స్పందిస్తూ ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. నిజాయితీగా, నిబద్ధతతో పనిచేసే అధికారులకు ప్రజలు ఇచ్చే గౌరవానికి కౌలుట్లయ్యకు లభించిన ఆదరణ నిదర్శనమని వారు పేర్కొన్నారు.
పోలీస్‌ అధికారి మాత్రమే కాకుండా ప్రజలతో మమేకమై వారి సమస్యలను అర్థం చేసుకుని పరిష్కార మార్గాలు చూపిన వ్యక్తిగా కౌలుట్లయ్య గుర్తింపు పొందారని పలువురు అభిప్రాయపడ్డారు. ఆయన బదిలీ వార్తతో స్థానిక ప్రజల్లో భావోద్వేగ స్పందన వ్యక్తమవుతుండటం, ఆయనపై ఉన్న అభిమానానికి నిదర్శనంగా నిలుస్తోందని పేర్కొన్నారు.శింగనమల ప్రాంతంలో శాంతిభద్రతల పరిరక్షణకు తన వంతు సేవలందించిన అధికారిగా కౌలుట్లయ్య పేరు ప్రజల మదిలో చిరస్థాయిగా నిలిచిపోతుందని స్థానికులు అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో కూడా ఆయన తన సేవా దృక్పథం, అంకితభావం, నిజాయితీతో మరింత ఉన్నత స్థానాలను అధిరోహిస్తూ ప్రజాసేవలో విశిష్ట గుర్తింపు పొందాలని ఆకాంక్షించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు