పుట్టిన ప్రతీ శిశువుకు పోలియో టీకా తప్పనిసరి
డాక్టర్ శైలజా రాణి
విశాలాంధ్ర – సీతానగరం: పోలియో రహిత సమాజం కోసం ప్రతీ ఒక్కరూ బాధ్యత వహిస్తూ పుట్టిన ప్రతీ శిశువుకు పోలియో టీకా తప్పనిసరిగా వేయించాలని సీతానగరం ప్రాదమిక ఆరోగ్య కేంద్రం వైద్య అధికారిణి డాక్టర్ శైలజా రాణి అన్నారు. శుక్రవారం పి ఎచ్ సి కేంద్రంలో డాక్టర్ శైలజా రాణి అధ్వర్యంలో ప్రపంచ పోలియో వ్యతిరేక దినోత్సవం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడుతూ పోలియో వ్యాధి వల్ల చిన్న పిల్లల్లో అంగవైకల్యం కలుగుతుందని ఇది రాకుండా ఉండడం కోసం పుట్టిన ప్రతీ శిశువుకు విధిగా పోలియో టీకా వేయించాలని తద్వారా ఈ వ్యాధి రాకుండా అరికట్టవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రఘునాథ్, వైద్య ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.


