విశాలాంధ్ర- అనంతపురం టౌన్ : ప్రభుత్వ మెడికల్ కళాశాల అనంతపురంలో 77 వ గణతంత్ర దినోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య డాక్టర్ ఎం విజయ జెండాను ఎగురవేసి వైద్యులను వైద్య విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఎందరో స్వాతంత్ర సమరయోధుల కృషి ఫలితంగా వచ్చిన స్వతంత్రాన్ని, పటిష్టమైన రాజ్యాంగాన్ని అమలుపరుస్తూ నేడు దేశమంతా గణతంత్ర వేడుకలను నిర్వహించుకోవడం మనందరికీ గర్వకారణమని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ లు ఆచార్య డాక్టర్ సావోలు షారూన్ సోనియా, ఆచార్య డాక్టర్ శంషాద్ బేగం, ఆచార్య డాక్టర్ శంకర్, ఆచార్య డాక్టర్ తెలుగు మధు, ప్రొఫెసర్లు డాక్టర్ వేముల శ్రీనివాసులు, డాక్టర్ మేడా ఆత్మరామ్, డాక్టర్ శివ శంకర్ నాయక్, డాక్టర్ ఎస్ ఉమామహేశ్వరరావు, డాక్టర్ బ్రహ్మానందం, డాక్టర్ నవీన్, ఇతర డాక్టర్లు డాక్టర్ మనోరంజన్ రెడ్డి, డాక్టర్ బి ఆర్ శ్యాం ప్రసాద్, డాక్టర్ గాలేటి చంద్రశేఖర్, డాక్టర్ లలిత భవాని, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ లలిత భవాని, కార్యక్రమ వ్యాఖ్యాత డాక్టర్ ఆదిరెడ్డి పరదేశి నాయుడు ఫిజికల్ డైరెక్టర్ నరసింహ నాయక్, తదితరులు పాల్గొన్నారు.


