రోడ్డు ప్రమాదాలు నివారణకు శిక్షణ తరగతులు దోహదం
– శిక్షణ తరగతులు ప్రారంభించిన జిల్లా రవాణా అధికారి వై.ఎస్.ఎన్ మూర్తి
విశాలాంధ్ర – రాజమహేంద్రవరం రూరల్ : రోడ్లపై జరిగే ప్రమాదాలు నివారించేందుకు ఇటువంటి శిక్షణ తరగతులు దోహదపడతాయని తూర్పు గోదావరి జిల్లా రవాణా అధికారి యేలూరి సత్యనారాయణ మూర్తి అన్నారు.జిల్లా కేంద్రమైన రాజమహేంద్రవరం లోని ఆర్టీసీ డిపో నందు ప్రమాద రహిత డ్రైవింగ్ శిక్షణ తరగతులను తూర్పు గోదావరి జిల్లా రవాణా అధికారి యేలూరి సత్యనారాయణ మూర్తి శుక్రవారం ప్రారంభించారు. నెల రోజుల పాటు జరగనున్న శిక్షణ తరగతులకు ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లోని 16 డిపోల నుండి మొత్తం 1014 డ్రైవర్లు హాజరుకానున్నారు. ఈ సందర్బంగా
ఆయన మాట్లాడుతూ ఈ నెల 28 నుండి డిసెంబర్ 31 వ తేదీ వరకు హైర్ బస్ డ్రైవర్స్ మరియు ఆన్ కాల్ డ్రైవర్లకు శిక్షణ అందిస్తున్నామన్నారు.ఒక్కొక్క డ్రైవరకు 2 రోజులు పాటు శిక్షణ అందిస్తాం ప్రతిరోజు సుమారు 60 మందికి శిక్షణ ఇచ్చే విధంగా ప్రణాళిక రూపొందించామన్నారు. ప్రతిరోజు ఆర్టీసీ అధికారులు, ట్రాఫిక్ పోలీస్ అధికారులు, రవాణా అధికారులచే శిక్షణ అందిస్తారని తెలిపారు. ట్రాఫిక్ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్స్ ఏ. శివాజీ, పి. శ్రీనివాస్ శిక్షణా తరగతులను ప్రారంభించినట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం డిపో మేనేజర్ కె.మాధవ్, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదాలుశిక్షణ తరగతులు
- Advertisement -
RELATED ARTICLES


