–డుంబ్రిగుడ ఎస్ ఐ సురేష్
విశాలాంధ్ర- డుంబ్రిగుడ (అల్లూరి జిల్లా): రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని డుంబ్రిగుడ ఎస్ ఐ సురేష్ కుమార్ అన్నారు. మండలంలోని కించు మండ వారపు సంతలో రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. రోడ్డు ప్రమాదాలు ఒక్క కుటుంబానికి కాకుండా సమాజానికి తీరని నష్టం కలిగిస్తుందని చెప్పారు. ప్రతి ఒక్కరూ రోడ్డు నిబంధనాలను తప్పనిసరిగా పాటించినట్లయితే ప్రమాదాలను అదుపు చేయవచ్చని చెప్పారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి రోడ్డు భద్రతను తమ జీవిత భాగంగా భావించాలని కోరారు. అనంతరం ఇటీవల నారింజ వలస గ్రామానికి చెందిన ఒక మహిళ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంఘటనను దృష్టిలో ఉంచుకొని ఆ ప్రమాదంలో మృతి చెందిన మహిళ కుటుంబ సభ్యులకు అవగాహన కార్యక్రమానికి ఆహ్వానించి కుటుంబ సభ్యులకు నిత్యవసర సరుకులు పంపిణీ చేసి మానవత్వం చాటుకున్నారు. దీంతో పలువురు ఎస్ఐ సురేష్ కు అభినందించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది తదితరులు


