- Advertisement -
విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మండల కేంద్రమైన పెద్దకడబూరులోని శ్రీ చౌడేశ్వరి, శ్రీ కాళికాదేవి ఆలయాల్లో సోమవారం శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్దలతో ప్రారంభమయ్యాయి. చౌడేశ్వరిదేవికి తోటప్పయ్య ఆకుపూజ, కుంకుమార్చన, పంచామృతాభిషేకం, బిల్వార్చన వంటి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిగా కాళికాదేవి విశ్వ వాసు నామ సంవత్సరం శుక్లపక్షం పాడ్యమి రోజున విశ్వబ్రాహ్మణ దంపతులు కాలమ్మ భీమేష్ ఆచార్యులు అమ్మవారికి జలాభిషేకము, వస్త్రాభరణం, ఆకు పూజ,, కుంకుమార్చన ధూప దీప నైవేద్యములు సమర్పించి మహామంగళ హారతి తదితర ప్రత్యేక పూజలు నిర్వహించారు.


