రైతుకు ఇబ్బంది కలిగించవద్దని సూచన
విశాలాంధ్ర – తాళ్లపూడి : రాష్ట్ర ప్రభుత్వం రైతుకు మేలు కలిగేలా నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోళ్లు, సంబంధిత పరిస్థితులు, మిల్లులో దిగుమతులు, ముఖ్యన్గా సంచులు కేటాయింపు వంటి విషయాలు ఎలా జరుగుతున్నాయన్న అంశాల పట్ల పరిశీలన నిమిత్తం తాళ్లపూడి మండల తహసీల్దార్ లక్ష్మీ లావణ్య రైస్ మిల్లులు ను ఆకస్మిక తనిఖీ చేశారు. పైడిమెట్టలో గల శ్రీ సాయి రైస్ మిల్ ను ఆమె వి.ఆర్.వోలు ఇతర సిబ్బంది తో కలిసి మిల్లు లో పరిశీలించారు. 15వేల క్వింటాల్స్ ధాన్యం కొనుగోలు లక్ష్యం కాగా ఇప్పటికే 10వేల 586 క్వింటాల్స్ ధాన్యం సేకరణ జరిగిందని తహసీల్దార్ పేర్కొన్నారు. రైతుకు ఎటువంటి ఇబ్బంది కలిగించ వద్దని సూచించారు


