వైకాపా నాయకులు తోట రామకృష్ణ
విశాలాంధ్ర – తాళ్లపూడి : ఎన్డీయే ప్రభుత్వం లో నే రైతుకు మేలు జరుగుతుందన్న టీడీపీ నాయకుల మాటలు ప్రచారానికే పరిమితమని, వాస్తవానికి రైతుకు కొత్తగా జరిగిందేమి లేదని పెద్దెవం గ్రామ ఉప సర్పంచ్, జిల్లా వైకాపా నాయకులు తోట రామకృష్ణ ఎన్డీయే కూటమి ప్రభుత్వ చర్యలను విమర్శింశారు. పెద్దెవం రైతు సేవ కేంద్రం వద్ద వరుసగా సుమారు 10 నుండి 15 రోజులుగా మిల్లుకు తొలిన ధాన్యానికి నేటికి డబ్బులు పడలేదని రైతులు ఇక్కట్లు ఎదుర్కొంటున్న విషయాన్ని వెల్లడించారు. టార్గెట్లు లేదని, టార్గెట్ లేకుండా రైతుకు డబ్బులు పడవని చెప్పటం తో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ధాన్యం అమ్మిన వెంటనే డబ్బులు కేవలం గంటల వ్యవధిలోనే రైతుఖాతాకు జమ అవుతున్నాయనటం వాస్తవం కాదని తమ కష్టాలను కలెక్టర్ దృష్టికి తీసుకువెళతామన్నారు


