విశాలాంధ్ర – కడియం : తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపులంక సర్ ఆర్ధర్ కాటన్ నర్సరీ ఫార్మర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బొర్సు సుబ్బారాయుడు, పాలక వర్గ సభ్యులు మంగళవారం రాజమహేంద్రవరం మాజీ పార్లమెంట్ సభ్యులు మార్గాని భరత్ ను మర్యాద పూర్వకంగా కలిశారు. కడియం నర్సరీ రంగం అభివృద్ధి కి ముఖ్యంగా గత ప్రభుత్వంలో నర్సరీ అభివృద్ధికి అవసరమైన నర్సరీ శిక్షణ కొరకు ధవలేశ్వరంలో సుమారు 10 ఎకరాల భూమిని కేటాయించడం జరిగిందని, దానికి సంబంధించిన పూర్తి వివరాలు నర్సరీకి అందించడం జరుగుతుందని వాటిని వినియోగించుకుని కేంద్ర ప్రభుత్వం నుండి నర్సరీ రంగానికి సహాయ సహకారాలు పూర్తిగా వినియోగించుకోవాలని మార్గాని భరత్ అన్నారు. ఈ సందర్భంగా బోరుసు సుబ్బారాయుడు మాట్లాడుతూ కడియం నర్సరీ రంగం ఎంతో మందికి ఉపాధి కల్పిస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో బోర్సు సుబ్బారాయుడు, వైఎస్ఆర్సిపి తూర్పుగోదావరి జిల్లా రైతు విభాగ జనరల్ సెక్రెటరీ ఈలి గోపాలరావు, మార్గాని బలరాం, ఆలమూరు శ్రీను, తాడాల సత్యనారాయణ, పాఠంశెట్టి శ్రీను వాసు, పుల్లా శ్రీను, గట్టా కృష్ణ భగవాన్ , సానా రాజు , కామిశెట్టి వెంకటేష్, డేగల రాము, అన్నందేవుల వెంకటేశ్వర్రావు, బోడపాటి చంద్రశేఖర్ శ్రీనివాస్, దూలం సత్యనారాయణ మూర్తి , బొర్సు సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.
మాజీ ఎంపీ మార్గాన్ని భరత్ ను కలిసిన సర్ ఆర్ధర్ కాటన్ నర్సరీ ఫార్మర్స్ అసోసియేషన్ నూతన పాలక వర్గం
- Advertisement -
RELATED ARTICLES


