Homeజిల్లాలుశ్రీ సత్యసాయినేత్రదానంతో ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపిన నేత్ర దాత పి. నరసింహారెడ్డి

నేత్రదానంతో ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపిన నేత్ర దాత పి. నరసింహారెడ్డి

- Advertisement -

విశాలాంధ్ర ధర్మవరం;; నేత్రదానముతో ఇద్దరి జీవితాల్లో నేత్రదాత పి నరసింహారెడ్డి వెలుగులు నింపారు. రాప్తాడు మండలం యర్రగుంటకి చెందిన పప్పూరు నరసింహారెడ్డి (73) వృద్ధాప్యం తో మరణించగా, విశ్వదీప సేవా సంఘం సభ్యులు నేత్రదానంపై వారి కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించడంతో వారు నేత్రధానం కి సహకరించినందున జిల్లా అందత్వ నివారణ సంస్థ, అనంతపురం రెడ్ క్రాస్ సొసైటీ డివై కుల్లాయప్ప కంటి రెట్రావైల్ సెంటర్ వారి టెక్నీషన్ జి. రాఘవేంద్ర కంటి కార్నియా సేకరించడం జరిగింది . నేత్రదానానికి సహకరించిన దాత భార్య లక్ష్మి నారాయణమ్మ, కుమారుడు విశ్వనాధ్ రెడ్డి, కోడలు లలిత, కుమార్తెలు ఉమాదేవి, మంజుల అల్లుళ్ళు హరినాథ్ రెడ్డి, సాంబశివారెడ్డి తమ్ముడు పప్పూరు బయపురెడ్డి మరదలు లక్ష్మీదేవి సేవా సంఘం వారు కృతజ్ఞతలు తెలియజేసినారు ఈ కార్యక్రమంలో ఫౌండర్ కోళ్ళమొరం చంద్రశేఖర్ రెడ్డి, అధ్యక్షులు గాజుల సురేష్,ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి సెక్రటరీ జుజారు రఘు, ధనుంజయ విశ్వదీప సేవా సంఘం సభ్యులు పాల్గొన్నారు. నేత్రదానం చేయువారు
9392323605,9666629841 కు ఫోను చేయగలరు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు