విశాలాంధ్ర – జేఎన్టీయూ ఏ: జేఎన్టీయూ అనంతపురం సివిల్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన ఆచార్యురాలు వైశాలి జి. ఘోర్పడేకు ప్రతిష్టాత్మకమైన ‘విశిష్ట మహిళా ఇంజినీర్ అవార్డు-2026 దక్కింది. ది ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజినీర్స్ ఇండియా, ఆంధ్రప్ర దేశ్ రాష్ట్ర ఇంజినీరింగ్ కేంద్రం సంయుక్తంగా నిర్వహించే 59వ ఇంజినీర్స్ దినోత్సవం పురస్కరించుకొని ఈ అవార్డు ను అందుకోనున్నారు. 70కి పైగా పరిశోధన పత్రాలు, పుస్తకాలు ప్రచురించారు. పరిశోధన, అభివృద్ధి విభాగం డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. పరిపాలన నాయకత్వం, సంస్థాగత అభివృద్ధి, విద్యార్థుల సంక్షేమం పట్ల నిబద్ధతను గుర్తించి అవార్డు ప్రకటించారు. స్ట్రక్చరల్ ఇంజినీరింగ్, కాంక్రీట్ టెక్నాలజీపై ప్రొఫెసర్ వైశాలి పరిశోధనలు నిర్వహించి పేటెంట్లు దక్కించుకున్నారు. గతంలో కూడా ఆమె రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు, ఐఎన్టీఈ ఉత్తమ సివిల్ ఇంజినీర్ పురస్కారాలు అందుకు న్నారు. వీసీ, రిజిస్ట్రార్ పలువురు ఆచార్యులు, అధ్యాపక బృందం శుభాకాంక్షలు తెలిపారు.


