Homeజిల్లాలుశ్రీ సత్యసాయిముగిసిన జాతీయ పౌష్టికాహార వారోత్సవాలు. మానవత స్వచ్ఛంద సేవా సంస్థ

ముగిసిన జాతీయ పౌష్టికాహార వారోత్సవాలు. మానవత స్వచ్ఛంద సేవా సంస్థ

- Advertisement -

విశాలాంధ్ర ధర్మవరం; పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో జాతీయ పౌష్టిక ఆహార వారోత్సవాలు ముగింపు సందర్భంగా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ వారు ఆసుపత్రిలోని గర్భిణీ స్త్రీలకు ఆసుపత్రి సూపర్డెంట్ తిప్పే నాయక్ చేతుల మీదుగా రెడ్లు, పండ్లు పంపిణీ చేశారు. అనంతరం సూపర్డెంట్ త్రిపేంద్ర నాయక్, గైనకాలజిస్ట్ డాక్టర్ జయలక్ష్మి, డాక్టర్ సురేష్, డాక్టర్ నజీర్, ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు సంకారపు నరసింహులు, మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు శంకర్ నాయుడు, ఉపాధ్యక్షులు మంజునాథ్ మాట్లాడుతూ మంచి ఆరోగ్యానికి మంచి ఆహారం బెల్లం, సద్దలు, రాగులు, చిరుధాన్యాలు అని తెలిపారు. అంగన్వాడి సెంటర్లో ఇటువంటి ఆహారాలు ఇవ్వడం ఎంతో సంతోషించదగ్గ విషయం అని తెలిపారు. గర్భిణీ స్త్రీలు ఎప్పటికప్పుడు నెలవారి చెకప్ లు చేసుకోవాలని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి సేవలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ప్రతి గర్భిణీ స్త్రీ కూడా శిశువు ఉన్నాడనేది గుర్తుపెట్టుకొని ఆరోగ్య సూత్రాలను పాటించాలని, మంచి పౌష్టిక ఆహారం తీసుకోవాలని తెలియజేశారు. ప్రతి గర్భిణీ స్త్రీ కి మంచి నిద్ర అవసరమని ఆరోగ్యానికి మంచిదిగా ఉన్నటువంటి ఆకకూరలు పండ్లు, సముతులిత ఆహారం తీసుకోవాలని తెలిపారు. సెల్ ఫోన్ లో ఉన్నవ్ ఎక్కువగా వినియోగించరాదని తెలిపారు. ప్రశాంతమైన జీవితానికి కుటుంబ సభ్యులు కూడా సహకరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో చిన్నప్ప, విష్ణు మాయ, ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది, మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు