Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఅధిక వడ్డీలకు అప్పులు ఇస్తున్న 8 మందికి కౌన్సెలింగ్: డీఎస్పీ బి. వి.జగన్నాథ్‌ రాజు

అధిక వడ్డీలకు అప్పులు ఇస్తున్న 8 మందికి కౌన్సెలింగ్: డీఎస్పీ బి. వి.జగన్నాథ్‌ రాజు

- Advertisement -

విశాలాంధ్ర ధర్మవరం;;ధర్మవరం లో అధిక వడ్డీలకు అప్పులు ఇస్తూ,అప్పు తీసుకున్న వారిని ఇబ్బందులకు గురిచేస్తున్న వారిపై పోలీసులు దృష్టి సారించారు. అధిక వడ్డీలకు అప్పులు ఇస్తున్న 8 మంది వ్యక్తులను డి.ఎస్.పి కార్యాలయానికి పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చినట్లు ధర్మవరం డీఎస్పీ బి. వి. జగన్నాథ్‌రాజు తెలిపారు.ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ధర్మవరం లో అధిక వడ్డీలకు అప్పులు ఇస్తున్న కొంతమందిని గుర్తించి వారిని డి.ఎస్.పి కార్యాలయానికి పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించినట్లు తెలిపారు. అప్పు తీసుకున్న వ్యక్తులు సకాలంలో డబ్బులు చెల్లించలేదనే కారణంతో వారి ఇళ్ల వద్దకు వెళ్లి గొడవలు చేయడం,బెదిరించడం,అసభ్యంగా ప్రవర్తించడం లేదా ఇతర విధాలుగా వేధింపులకు గురిచేయడం వంటివి చేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు.
అప్పులు ఇచ్చిన వారు డబ్బుల వసూలు పేరుతో చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని సూచించారు. అధిక వడ్డీల వ్యవహారాల్లో ఎవరైనా వేధింపులకు గురైతే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు