Homeజిల్లాలుఅనంతపురందీర్ఘాయుష్షుకు మూలాధారం ఆహారం..

దీర్ఘాయుష్షుకు మూలాధారం ఆహారం..

- Advertisement -

పీవీకేకే డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డా రాఘవేంద్ర ప్రసాద్

విశాలాంధ్ర – జేఎన్టీయూ ఏ: దీర్ఘాయుష్షుకు మూలాధారం ఆహారం అని పీవీకేకే డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డా రాఘవేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. కళాశాలలో ఫుడ్ పేస్ట్ ను ఘనంగా నిర్వహించారు. అనంతరం ప్రిన్సిపల్ మాట్లాడుతూ..ప్రతిరోజు తినే ఆహారంలో పీచుపదార్థాలు, ప్రోటీన్లు, విటమిన్లు మరియు ఖనిజాలు సరిపడా ఉండేలా చూసుకోవాలి.రోజువారీ ఆహారంలో కనీసం ఒక భాగం తాజా పండ్లు , ఆకుకూరలు ఉండేలా చూసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
ప్రాసెస్ చేసిన ఆహారానికి దూరం: జంక్ ఫుడ్, మైదా పదార్థాలు, అతిగా నూనెలో వేయించిన ఆహారాలు మరియు అధిక చక్కెర కలిగిన పానీయాలను తగ్గించాలని సూచించారు. విద్యార్థులు తయారుచేసిన ప్రకృతి ప్రసాదించిన సహజ సిద్ధ వంటకాలను తయారుచేసిన విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు సురేష్, శాంతి,ప్రియ, ఉషా ,కిరణ్మయి, హర్షిత , విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు