Homeజిల్లాలుతూర్పు గోదావరిహరిహర మహా క్షేత్రంలో గణపతి నవరాత్రులకు రాట ముహూర్తం

హరిహర మహా క్షేత్రంలో గణపతి నవరాత్రులకు రాట ముహూర్తం

- Advertisement -

–ఆలయ చైర్మన్ మార్గాని సత్యనారాయణ ఆధ్వర్యంలో వైభవంగా ప్రారంభమైన ఏర్పాట్లు

విశాలాంధ్ర – కడియం : కడియం మండలం కడియపులంకలో కొలువై ఉన్న శ్వేత గణపతి స్వామివారి నవరాత్రి ఉత్సవాలకు రాట ముహూర్త కార్యక్రమం బుధవారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ నెల 14వ తేదీ నుంచి ప్రారంభం కానున్న గణపతి నవరాత్రి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేపట్టారు. హరిహర మహాక్షేత్ర ఆలయ చైర్మన్ మార్గాని సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన రాట ముహూర్త కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు, భక్తులు, స్థానికులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణనాథుని ఆశీస్సులతో నవరాత్రి ఉత్సవాలు ఎటువంటి విఘ్నాలు లేకుండా విజయవంతంగా సాగాలని ఆకాంక్షిస్తూ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మార్గాని సత్యనారాయణ మాట్లాడుతూ, శ్వేత గణపతి స్వామివారి నవరాత్రి ఉత్సవాలను భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించేలా ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన సౌకర్యాలు కల్పించడంతో పాటు, ప్రత్యేక పూజలు, కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. కడియపులంకలో శ్వేత గణపతి నవరాత్రి ఉత్సవాలు ప్రతి సంవత్సరం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటాయని, ఈ ఏడాది కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. రాట ముహూర్తంతో నవరాత్రి ఉత్సవాలకు శ్రీకారం చుట్టడంతో కడియపులంకలో ఆధ్యాత్మిక సందడి ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు,భక్తులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు