విశాలాంధ్ర ధర్మవరం; పట్టణములోని రుషి విద్యాలయ, సూర్య ఉన్నత పాఠశాల, కాకతీయ విద్యా నికేతన్లలో వసంత పంచమి వేడుకలను ఆయా పాఠశాలల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థుల నడుమ ఘనంగా నిర్వహించుకున్నారు. ఇందులో భాగంగా రిషి విద్యాలయంలో వెల్ బేబీ షో కూడా నిర్వహించారు. వసంత పంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ షోను నిర్వహించినట్లు డీన్ భాస్కర్ రెడ్డి తెలిపారు. అక్షరాభ్యాసం ప్రాధాన్యతను సిఏఓ రవీంద్ర తెలపగా ప్రిన్సిపాల్ స్వరూప సింగ్ విద్యతోపాటు సంస్కారాలు కూడా పిల్లలలో పెంపొందించాలని వారు తెలిపారు. తదుపరి వైస్ ప్రిన్సిపాల్ కళ్యాణి చిన్నారులకు అక్షరాభ్యాసాన్ని నిర్వహించారు. బేబీ షోలో పాల్గొన్న చిన్నారులకు బహుమతులను అందజేశారు. అనంతరం విద్యార్థులకు ఉపాధ్యాయులకు వసంత పంచమి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏవో రంగారెడ్డి తోపాటు తల్లిదండ్రులు, పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.
కాకతీయ విద్యా నికేతన్ పాఠశాలలో వసంత పంచమి వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా శాస్త్రీయ పద్ధతిలో అర్చకులతో సరస్వతీ పూజలు నిర్వహించి , విద్యార్థుల తల్లిదండ్రుల సమక్షంలో తొలిసారి అక్షరాభ్యాసమును నిర్వహించారని కరస్పాండెంట్ నిర్మలాదేవి, డైరెక్టర్ పద్మ, సూర్యప్రకాశ్ రెడ్డి తెలిపారు. ఈ వేడుకలకు పెద్ద ఎత్తున తల్లిదండ్రులు పాల్గొన్నారు.
సూర్య ఉన్నత పాఠశాలలో వేడుకలు;; పట్టణంలోని సూర్య ఉన్నత పాఠశాల లో వసంత పంచాయితీ వేడుకలను హెడ్మాస్టర్ నరేంద్రబాబు అధ్యక్షతన ఉపాధ్యాయులు, విద్యార్థులు నడుమ ఘనంగా నిర్వహించుకున్నారు. సాంప్రదాయ పద్ధతిలో అర్చకుల ద్వారా సరస్వతీ పూజ చేయించి వారి ఆశీస్సులను వారు అందజేశారు. అనంతరం అర్చకులు సరస్వతి పూజ యొక్క ప్రాధాన్యతను వివరించారు. ఈ వసంత పంచమి రోజున తల్లిదండ్రులతో పాటు విద్యార్థులు ఎంతో పవిత్రంగా భావిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు


