Homeజిల్లాలుఅనంతపురంకూరగాయల వ్యాపారి దాదా ఖలంధర్ మృతి..

కూరగాయల వ్యాపారి దాదా ఖలంధర్ మృతి..

- Advertisement -

విశాలాంధ్ర, కళ్యాణదుర్గం.. కూరగాయల మండి మర్చంట్ దాదా ఖలంధర్ (52) బుధవారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు. పట్టణంలో సుపరిచితుడుగా ఉంటూ సౌమ్యుడిగా పేరుంది. వ్యాపారంలో ఆర్థిక ఒడుదుడుకులు కారణంగా కొంత ఇబ్బందులు ఎదురైనట్లు తెలిసింది. దాదా ఖలందర్ కి భార్య, ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. మంగళవారం రాత్రి వరకు ఆరోగ్యంగా ఉన్న దాదా ఖలందర్ బుధవారం తెల్లవారుజామున ఆకస్మికంగా గుండెపోటు రావడంతో మృతి చెందారు. దాదా ఖలందర్ మృతి పట్ల పట్టణ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. టీడీపీ మాజీ కౌన్సిలర్ tkb ఇస్మాయిల్, వినియోగదారులు సంఘం నాయకులు చల్లా కిషోర్, టిడిపి నాయకులు ఓబులరాజు, రెహమాన్, రోజ్లీ రాజేష్ తదితరులు భౌతిక కాయానికి నివాళి అర్పించారు

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు