Homeజిల్లాలుఅనంతపురంపి.వి.కె.కె. ఇంజినీరింగ్ కళాశాల అధ్యాపకురాలికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు..

పి.వి.కె.కె. ఇంజినీరింగ్ కళాశాల అధ్యాపకురాలికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు..

- Advertisement -

విశాలాంధ్ర – జేఎన్టీయూఏ:పీ.వి.కె.కె. ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ డా. సి. వీణా కి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ బెస్ట్ టీచర్ అవార్డు – 2025ను అందుకున్నారు.ఈ అవార్డు సొసైటీ ఫర్ లెర్నింగ్ టెక్నాలజీస్ సంస్థ ఆధ్వర్యంలో మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ – సీఈఓ , ఏఐసిటి ఈ చీఫ్ కోఆర్డినేటింగ్ ఆఫీసర్ డాక్టర్ బుద్ధ చంద్రశేఖర్ డా.వీణా కి అందజేశారు. ఉపాధ్యాయ వృత్తిలో విశిష్ట సేవలు, వినూత్న బోధన పద్ధతులు, విద్యార్థుల అభివృద్ధికి చేసిన అంకితభావం , నిదర్శనంగా అవార్డు వచ్చింది అన్నారు. అవార్డు గ్రహీతను శ్రీ బాలాజీ విద్యాసంస్థల అధినేత, కళాశాల ఛైర్మన్ డాక్టర్ పల్లె కిషోర్ రెడ్డి అభినందించారు. ఈ కార్యక్రమంలో
కళాశాల ప్రిన్సిపాల్ డా.బండి రమేష్ బాబు ,వైస్ ప్రిన్సిపాల్ డా.దీప్తి జోర్డాన, డీన్ డా.సంతోష్ కుమార్ రెడ్డి, ఏవో డా.మనోహర్ రెడ్డి , అధ్యాపక బృందం అభినందనలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు