Homeజిల్లాలుఅనంతపురంసుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం చేయండి..

సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం చేయండి..

- Advertisement -

ప్రధానమంత్రి  పర్యటనను అడ్డుకుంటాం :- బంజారా నాయకులు..

విశాలాంధ్ర పుట్టపర్తి: – సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం చేయాలని అఖిల భారత బంజారా సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అంజి నాయక్ పేర్కొన్నారు. బుధవారం ప్రశాంతి గ్రామంలో ఆంజనేయులునాయక్ విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికలు  ముందు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆ కుటుంబానికి న్యాయం చేస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కుటుంబానికి ఇంతవరకు న్యాయం చేయలేదన్నారు.రాష్ట్ర ప్రభుత్వం సుగాలి ప్రీతి కుటుంబానికి ఎటువంటి న్యాయం జరగలేదని,కర్నూలు జిల్లాలో జరిగే పీఎం నరేంద్ర మోదీ కార్యక్రమాన్ని అడ్డుకుంటామని అఖిలభారత బంజారా సేవా సంఘం నాయకులు హెచ్చరించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా  శ్రీనివాస్ నాయక్ మాట్లాడుతూ సుగాలి ప్రీతిని అడ్డుపెట్టుకొని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చారని దానిని మరిచిపోవడం అత్యంత శోచనీయమన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని గాలికి వదిలేసారన్నారు .పవన్ కళ్యాణ్ సుగాలి ప్రీతి కుటుంబాన్ని పరామర్శించినప్పుడు తాము కూడా వెన్నంటున్నామని ఆయన ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేర్చలేదన్నారు. దీనిపై ప్రీతి తల్లి ఇప్పటికీ కూడా పోరాటం చేస్తుందన్నారు. వారికి ఎటువంటి న్యాయం జరగట్లేదని మండిపడ్డారు. వీరికి న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తామని, బంజారాలంతా ఏకమై కర్నూల్ లో జరిగే పీఎం సభను అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏబీవీఎస్ఎస్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ నాయక్, రాష్ట్ర ఉపాధ్యక్షులు నారాయణ నాయక్, ఏ బి బిఎస్ఎస్ జిల్లా అధ్యక్షులు సభావత్ శ్రీనివాస్ నాయక్,జిల్లా ఉపాధ్యక్షులు రాజేంద్ర నాయక్  & దుర్గా ప్రసాద్ నాయక్ & హరీష్ నాయక్,జిల్లా ప్రధాన కార్యదర్శి (చిన్న) నారాయణస్వామి నాయక్,కోశాధికారి బి రవీంద్రనాయక్.పుట్టపర్తి మండల అధ్యక్షులు సాయిరాం నాయక్.రాష్ట్ర గౌరవ అధ్యక్షులు సేవే నాయక్,రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ తిరుపాల్ నాయక్ , ఆనంద నాయక్ తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు