Homeజిల్లాలుశ్రీ సత్యసాయినూతన కమిషనర్ గా వెంకటరమణయ్య

నూతన కమిషనర్ గా వెంకటరమణయ్య

- Advertisement -

-పురపాలక సంఘం కార్యాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరణ

విశాలాంధ్ర ధర్మవరం;ధర్మవరం పురపాలక సంఘం కార్యాలయ నూతన కమిషనర్ గా పి. వెంకట రమణయ్య బుధవారం ఉదయం పదవి బాధ్యతలు స్వీకరించారు. వీరు కర్నూల్ జిల్లాలో డ్వామా పీడీగా విధులు కొనసాగిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు మేరకు ధర్మవరం పురపాలక సంఘ కమిషనర్ గా బదిలీగా రావడం జరిగింది. అనంతరం కార్యాలయ అధికారులు, సిబ్బంది నూతన కమిషనర్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం నూతన కమిషనర్ పి. వెంకట రమణయ్య మాట్లాడుతూ అందరి సహాయ సహకారాలతో తాను పురపాలక సంఘ అభివృద్ధికి పాటుపడతానని వారు స్పష్టం చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ ను కలవడానికి వారు పుట్టపర్తి బయలుదేరి వెళ్లారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు