విశాలాంధ్ర – పెద్దకడబూరు : మండల పరిధిలోని చిన్నతుంబళం, కంబళదిన్నె, కల్లుకుంట, బాపులదొడ్డి, జాలవాడి, హెచ్ మురవణి తదితర గ్రామాల్లో 16వ వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గురువారం మండల కేంద్రమైన పెద్దకడబూరులో వైసీపీ మండల కన్వీనర్ రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో తన స్వగృహం నుంచి కార్యకర్తలతో బస్టాండ్ ఆవరణం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం వైసీపీ మండల కన్వీనర్ రామ్మోహన్ రెడ్డి, వైసీపీ బూత్ కమిటీ తాలూకా అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి, యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి రఘురామ్ మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమం కోసం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైసిపి పార్టీని స్థాపించారన్నారు. రాష్ట్రం ప్రగతి పథంలో నడవాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందన్నారు. పేద, బడుగు బలహీన వర్గాల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని కొనియాడారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి ఆశయ సాధన కోసం పుట్టిన పార్టీ వైసీపీ పార్టీ అని, ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శ్రీవిద్య, సర్పంచ్ చంద్రశేఖర్, ఎంపీటీసీ సభ్యులు లక్ష్మి, సుజాత, మల్లేష్, నాయకులు ముక్కరన్న, అర్లప్ప, దయ్యాల మహబూబ్, దస్తగిరి, బారుసబ్బు అనిల్, సుందరం, ఏసన్న, కాసిం, ప్రసాద్, నరసన్న, రామాంజని, అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.
వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- Advertisement -
RELATED ARTICLES


