Homeజిల్లాలుప్రకాశంనేడు రైతులఖాతాలో పీయం కిసాన్ మరియు అన్నదాత సుఖీభవ నిధులు జమ

నేడు రైతులఖాతాలో పీయం కిసాన్ మరియు అన్నదాత సుఖీభవ నిధులు జమ

- Advertisement -

విశాలాంధ్ర – వలేటివారిపాలెం : పీయం కిసాన్ మరియు మరియు అన్నదాత సుఖీభవ నిధులు 2025-2026సంవత్సరానికి గాను మూడవ విడత నిధులు పంపిణీ కార్యక్రమం శుక్రవారం సాయంత్రం ( 13 వ తేదీన ) 4 గంటలకు నిధులు రైతుల ఖాతా లో జమ చేయునున్నట్లు మండలవ్యవసాయశాఖ అధికారి కె వి శేషారెడ్డి గురువారం ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పీ యం. కిసాన్ నిది పధకంలో భాగంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడి 22వ విడతలో భాగంగా రూ. 2000 రూపాయలు చొప్పున వలేటివారిపాలెం మండలమునకు సంబంధించి మొత్తం 6365 మంది రైతులకు రూ. 1.13 కోట్ల రూపాయలు నగదును మరియు అన్నదాత సుఖీభవ పథకం కింద, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మూడవ విడతగా 4000రూపాయలు చొప్పున మొత్తం 6365 మంది రైతులకు గాను రూ.2.55 కోట్లనగదును విడుదల చేస్తారని అన్నారు మొత్తం కలిపి అన్నదాత సుఖీభవ – పి యం కిసాన్ పథకం కింద రూ. 3.68 కోట్ల రూపాయలురైతుల ఖాతాలలో డిబిటి విధానం ద్వారా నేరుగా జమచేసి, రైతుల వ్యవసాయ అభివృద్దికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల గురించి మరియు రైతులనుద్దేశించి ప్రసంగించనున్నారని అన్నారు.ఈ కార్యక్రమాన్ని కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) కందుకూరు లో నేడు సాయంత్రం 4 గంటలకు ప్రత్యక్ష ప్రసారం చేయడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన కందుకూరు శాసన సభ్యులు, ఇంటూరి నాగేశ్వర రావు పాల్గొంటారని అన్నారు.కావున ఈ క్రార్యక్రమానికి రైతులు, రైతు మహిళలు, యువత మరియు ఔత్సాహికులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసినదిగాఈ సందర్బంగా మండలవ్యవసాయశాఖ అధికారి కె. వి. శేషారెడ్డి తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు