Homeజాతీయంటీవీకే ఎమ్మెల్యేకు ఎదురుదెబ్బ

టీవీకే ఎమ్మెల్యేకు ఎదురుదెబ్బ

- Advertisement -

చెన్నై: తమిళనాడు నూతన ముఖ్యమంత్రి విజయ్ శాసనసభలో తన బలాన్ని నిరూపించుకునేందుకు సిద్ధమవుతున్న వేళ కీలక పరిణా మం చోటుచేసుకుంది. ఒక్క ఓటు తేడాతో నెగ్గిన టీవీకే ఎమ్మెల్యేకు మద్రాసు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. విజయ్ బలపరీక్షలో పాల్గొనవద్దని ఆ ఎమ్మెల్యేను ఆదేశించింది. ఈ మేరకు ఉన్నత న్యాయస్థానం మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో శివగంగై జిల్లా తిరుప్పత్తూర్ నియోజకవర్గం నుంచి టీవీకే నేత శ్రీనివాస సేతుపతి విజయం సాధించారు. ఇక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పెరియ కరుప్పన్‌పై కేవలం ఒకే ఒక్క ఓటు తేడాతో సేతుపతి గెలవడం ఆసక్తికరంగా మారింది. ఈ ఎన్నికల్లో డీఎంకే నేత పెరియకరుప్పన్ 83,374 ఓట్లు పొందగా… శ్రీనివాస సేతుపతి 83,375 ఓట్లతో విజయం సొంతం చేసుకున్నారు. ఈ ఫలితాలపై డీఎంకే నేత మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. పోస్టల్ బ్యాలెట్ ఓటు లెక్కింపులో పొరపాటు జరిగిందని పెరియ కరుప్పన్ ఆరోపించారు.
సుప్రీంను ఆశ్రయించిన సేతుపతి
తమిళనాడు రాష్ట్రానికి చెందిన టీవీకే ఎమ్మెల్యే శ్రీనివాస సేతుపతి వ్యవహారం మరో కీలక మలుపు తిరిగింది. మద్రాసు హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టును ఎమ్మెల్యే సేతుపతి ఆశ్రయించారు. అసెంబ్లీలో టీవీకే పార్టీ బలపరీక్ష ఎదుర్కోవాల్సి ఉండగా… దానికి దూరంగా ఉండాలంటూ హైకోర్టు ఆంక్షలు విధించింది. దీనిపై సేతుపతి ఉన్నత న్యాయస్థానం మెట్లు ఎక్కారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు