Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

ప్రైవేటు వర్సిటీల బిల్లుకు గ్రీస్‌ పార్లమెంటు ఆమోదం

ఏథెన్స్‌: వివాదాస్పద ప్రైవేటు యూనివర్సిటీల బిల్లును గ్రీస్‌ పార్లమెంటు శనివారం ఆమోదించింది. దీంతో దేశంలోకి ప్రైవేటు, నాన్‌ప్రాఫిట్‌ వర్సిటీలకు ప్రవేశం లభించింది. దీనికి వ్యతిరేకంగా గ్రీస్‌లో భారీ స్థాయిలో ఆందోళనలు జరుగుతున్నాయి. విద్యార్థుల ఆవేదనను ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ వివాదాస్పద బిల్లునకు ఆమోదముద్ర వేయించింది. పార్లమెంటులో 300 మంది సభ్యులు ఉండగా ఈ బిల్లుకు 159 మంది మద్దతిచ్చారు. దీంతో విదేశీ వర్సిటీలు ఇకపై గ్రీస్‌లో తమ శాఖలను ఏర్పాటు చేసుకొనే అనుమతి లభించింది. విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేయొచ్చుకానీ లాభాపేక్ష లేకుండా పనిచేయరాదని విదేశీ వర్సిటీలకు ఈ బిల్లు సూచిస్తోంది. గ్రీస్‌కు విదేశీ విద్యార్థులు పెరిగితే ఆర్థికంగా లాభాలోస్తాయని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. విద్యామంత్రి కిరియాకోస్‌ స్పందిస్తూ గ్రీస్‌లో తమ శాఖల ఏర్పాటునకు 10కిపైగా విదేశీ విశ్వవిద్యాలయాలు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. 202526 విద్యా సంవత్సరంలో ఈ విశ్వవిద్యాలయాలు ప్రారంభం కాబోతున్నట్లు తెలిపారు. ఉన్నత విద్యలో సంస్కరణలపై గ్రీస్‌ సమాజంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. వీటివల్ల ప్రభుత్వ వర్సిటీల డిగ్రీలకు విలువ లేకుండా పోతుందన్న వాదన బలంగా వినిపిస్తోంది. గ్రీస్‌లో అండర్‌ గ్రాడ్యుయేషన్‌ విద్యను ప్రభుత్వ వర్సిటీల్లో ఉచితంగా అందిస్తారు. ప్రైవేటు వర్సిటీలకు ద్వారాలు తెరవడం వల్ల విద్య వ్యాపాయీకరణ జరుగుతుందని స్థానిక విద్యార్థులు ఆవేదన వ్యక్తంచేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img