తెహ్రాన్: అమెరికా, ఇజ్రాయిల్ వద్ద అణ్వాయుధాలు ఉన్నప్పుడు ఇరాన్ వాటిని సమకూర్చుకోవడంలో తప్పేమిటని ఆ దేశ సీనియర్ కమాండర్ జనరల్ అహ్మద్ వాహిది ప్రశ్నించారు. అమెరికా, ఇజ్రాయిల్ అణ్వస్త్రాలు కలిగివున్నంత వరకు ఇరాన్ కూడా వాటిని సమకూర్చుకుంటూనే ఉంటుందని వాహిది స్పష్టం చేశారు. అయితే యుద్ధం వల్ల ప్రజానీకానికి తీవ్ర నష్టమంటూ మాజీ అధ్యక్షుడు మహమ్మద్ ఖతామీ ఆందోళన వ్యక్తంచేశారు. యుద్ధం జరుగుతున్నంత కాలం ప్రజలు భయపడుతూనే జీవించాలన్నారు. ఈ పరిస్థితులు తొలగితే శాంతి నెలకొనేలా దౌత్య పద్ధతుల్లో ముందుకెళ్లవచ్చన్నారు. ఇన్నాళ్లు బాహ్య ఒత్తిడిని తట్టుకొని ఇరాన్ ప్రభుత్వం నిలబడిందని, దీటుగా బదులిచ్చిందని, అయితే పరిస్థితులు మారకపోతే ప్రజల్లో అసంతృప్తి పెరిగిపోతుందని, తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి రావచ్చని ఖతామీ హెచ్చరికంచారు.
షరతులకు అంగీకరిస్తేనే హోర్మూజ్ తెరుస్తాం: గాలిబాఫ్
తాత్కాలిక ఒప్పందంలోని షరతులకు అమెరికా అంగీకరిస్తే హోర్మూజ్ జల సంధి తెరుచుకుంటుందని ఇరాన్ ఉన్నతాధికారి మహమ్మద్ బకర్ గాలిబాఫ్ స్పష్టంచేశారు. ఇది జరగనంత కాలం హోర్మూజ్‌ను తెరిచే ప్రసక్తే లేదన్నారు. మంగళవారం హోర్మూజ్ దాటేందుకు ప్రయత్నించిన నౌకపై గుర్తు తెలియని క్షిపణి దాడి జరిగిందని, నౌక ఇంజిన్ రూమ్ దెబ్బతిన్నదని, ఒమన్ కోస్ట్ గార్డు సహాయంతో సిబ్బంది తప్పించుకోగలిగారని ది యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ (యూకేఎంటీఓ) వెల్లడించింది. ఈ దాడిపై దర్యాప్తు జరుగుతోందని, పర్వాయరణపై ప్రభావానికి సంబంధించి ఎలాంటి నివేదికలు అందలేదన్నారు.
అమెరికా జవాన్లను పట్టిస్తే నగదు బహుమతి
అమెరికా సైనికులను పట్టుకున్నా, వారిని చంపినా 30 వేల అమెరికన్ డాలర్ల (5 బిలియన్ ఇరానియన్ టోమన్లకు సమానం) నగుదు బహుమతి అందిస్తామని ఇరాన్ ప్రజలకు ఆ దేశ సైనిక కమాండర్ అమీర్ హతామీ పిలుపునిచ్చారు. తెహ్రాన్‌లో ఇటీవల ప్రసంగించిన సమయంలో ఆయన ఈ మేరకు ప్రకటన చేసినట్లు స్థానిక వార్తా కథనాలు పేర్కొన్నాయి. అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చల్లో పురోగతి లేని క్రమంలో ఇరాన్ కమాండర్ ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మరోవైపు దక్షిణ లెబనాన్‌లో ఇజ్రాయిల్ దాడుల్లో 11 మంది చనిపోయారు. హెజ్బుల్లా కమాండర్లు అబు హసన్ అలా, అలీ సమీర్ అల్-హజ్ హసన్ లక్ష్యంగా దాడులు జరిగినట్లు ఐడీఎఫ్ తెలిపింది. మరోవైపు గజాలో కాల్పుల విరమణపై ఈజిప్టు రాజధాని కైరోలో హమాస్ ప్రతినిధి బృందం చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
అణ్వస్త్రాలు సమకూర్చుకుంటాం: ఇరాన్
- Advertisement -
RELATED ARTICLES


