Homeతెలంగాణట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థపై సమీక్ష

ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థపై సమీక్ష

- Advertisement -

విశాలాంధ్ర, హైదరాబాద్ : మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ట్రాఫిక్ సిగ్నల్స్‌ నిర్వహణ, పనితీరు ఆధునీకరణకు సంబంధించిన అంశాలపై ఎంఎంసీ కమిషనర్ టి.వినయ్ కృష్ణా రెడ్డి అధ్యక్షతన ఎంఎంసి ట్రాఫిక్వింగ్ అధికారులతో ఎంఎంసి ప్రధాన కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఈఈ ప్రాజెక్ట్స్‌ రోహిణి, డిప్యూటీ ఇంజినీర్లు మాధవి లత, రవీందర్, ఐబిఐ సీనియర్ మేనేజర్ అజయ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ట్రాఫిక్ సిగ్నల్స్‌ ప్రస్తుత స్థితి, నిర్వహణ, మరమ్మతులు, పనిచేయని సిగ్నల్స్‌ పునరుద్ధరణ, సిగ్నల్ వ్యవస్థ ఆధునీకరణ తదితర అంశాలను కమిషనర్ సమీక్షించారు. ప్రస్తుతం ఎంఎంసీ పరిధిలో 82 సిగ్నల్ లొకేషన్లు ఉండగా, వాటిలో 73 ట్రాఫిక్ జంక్షన్ సిగ్నల్స్‌, 9 పెలికాన్ సిగ్నల్స్‌ ఉన్నట్లు సమావేశంలో సమీక్షించారు. అదేవిధంగా 82 సిగ్నల్ లొకేషన్లలో 72 పనిచేస్తుండగా, 10 సిగ్నల్స్‌ వివిధ కారణాలతో సేవల్లో లేవని సమర్పించిన నివేదికలో పేర్కొన్నారు. ఫ్లైఓవర్ పనులు, ఇతర సంస్థల పనుల కారణంగా దెబ్బతిన్న లేదా తొలగించబడిన సిగ్నల్స్‌ను సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుని త్వరితగతిన పునరుద్ధరించాలని కమిషనర్ అధికారు లను ఆదేశించారు. ప్రజల రాకపోకలకు అంతరాయం కలగకుండా ట్రాఫిక్ సిగ్నల్స్‌ పనితీరుపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని సూచించారు. అలాగే సిగ్నల్ వ్యవస్థలో కౌంట్డౌన్ టైమర్లు, కంట్రోలర్లు, డిటెక్టర్లు, పవర్ ప్రొటెక్షన్ పరికరాలు, పెలికాన్ సిగ్నల్స్‌ తదితరాల ఆధునీకరణకు సంబంధించిన ప్రతిపాదనలను కూడా సమావేశంలో సమీక్షించారు. కొత్త నిర్వహణ వ్యవస్థలో ఇప్పటికే ఉన్న సిగ్నల్స్నిర్వహణతో పాటు అవసరమైన సాంకేతిక అప్‌గ్రేడ్లు, కొత్త సిగ్నల్స్‌ ఏర్పాటు వంటి అంశాలు ప్రతిపాదించబడ్డాయి. ట్రాఫిక్ సిగ్నల్స్‌కు సంబంధించిన ఫిర్యాదులు, సాంకేతిక లోపాలు మరియు పునరుద్ధరణ అవసరాలను ఆలస్యం లేకుండా పరిష్కరిం చేందుకు ఇంజినీరింగ్ విభాగం, ట్రాఫిక్ వింగ్ మరియు ఐబిఐ ప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని కమిషనర్ స్పష్టం చేశారు. మల్కాజ్‌గిరి పరిధిలోని ట్రాఫిక్సిగ్నల్ వ్యవస్థను మరింత సమర్థవంతంగా నిర్వహించడం ద్వారా ట్రాఫిక్ నియంత్రణ మెరుగుపరచడం, వాహనదారులకు సురక్షితమైన రాకపోకలు కల్పించడం, జంక్షన్ల వద్ద ట్రాఫిక్ రద్దీని తగ్గించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని కమిషనర్ సూచించారు. సురక్షితమైన, సజావుగా సాగే ట్రాఫిక్ వ్యవస్థ కోసం సిగ్నల్స్‌ నిర్వహణలో నాణ్యత, వేగం, సాంకేతిక సమర్థతకు ప్రాధాన్యం ఇవ్వాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు