Homeఆంధ్రప్రదేశ్డీఎస్‌సీ నిర్వహణ భేష్

డీఎస్‌సీ నిర్వహణ భేష్

- Advertisement -

లోకేశ్‌కు దిల్లీ మంత్రి ప్రశంసలు
విశాలాంధ్ర బ్యూరో`అమరావతి: డీఎస్‌సీ నిర్వహణ తీరుపై దిల్లీ పరిశ్రమల శాఖ మంత్రి సర్దార్ మన్జిందర్ సింగ్ శిర్సా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ను ప్రశంసించారు. వివాదాలకు తావివ్వకుండా పారదర్శకంగా రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి 16వేల మంది ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టిన తీరును కొనియాడారు. డీఎస్‌సీ నిర్వహణ తీరును ఆయన లోకేశ్‌ను ఆసక్తిగా అడిగారు. దిల్లీలో టీచర్ రిక్రూట్మెంట్ అంటేనే…కోర్టులో కేసులు, ఫిర్యాదులు, గందరగోళాలు సృష్టిస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. లోకేశ్ స్పందిస్తూ తాము డీఎస్‌సీ ద్వారా పరీక్ష నిర్వహించి ఎక్కడా చిన్న పొరబాట్లకు తావు లేకుండా 16 వేలకిపైగా ఉపాధ్యాయ నియామకాలు చేపట్టామన్నారు. అయినప్పటికీ ప్రతిపక్ష పార్టీ ఎన్నో ఆరోపణలు చేసి విఫలమైందన్నారు. కోర్టుల్లో సైతం వారు ఎక్కడా చిన్న అక్రమం జరిగినట్లు ఆధారాలు చూపించలేకపోయారని చెప్పారు. త్వరలో మరో 3వేల ఉపాధ్యాయ నియామకాలు చేపట్టనున్నట్లు చెప్పారు. విద్యాశాఖ తనకు ఎంతో ఇష్టమైన శాఖని, వినూత్న విధానాలు అమలు చేయడం ద్వారా సత్ఫలితాలు సాధిస్తున్నామన్నారు. మొట్టమొదటిసారి ప్రైవేటు పాఠశాలల నుంచి 1.10 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరారని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలపై, ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యా సంస్కరణలపై ప్రజల్లో పెరిగిన నమ్మకానికి ఇదో ఉదాహరణ అన్నారు. ఉపాధ్యాయుల, విద్యా శాఖ కార్యకలాపాలు పర్యవేక్షించడానికి లీప్ యాప్ రూపొందించామని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు