విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనున్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం శుక్రవారం సాయంత్రానికి ఉత్తర అండమాన్ సముద్రంలోకి ప్రవేశించనుంది. దీని ప్రభావంతో శనివారం నాటికి అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఈ ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లోని అనేక జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో అల్లూరి సీతారామరాజు, పోలవరం, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, ఎన్‌టీఆర్, కృష్ణా జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ హెచ్చరించారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు.
ఈసందర్భంగా గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన తేలిక పాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.
బంగాళాఖాతంలోమరో అల్పపీడనం
- Advertisement -
RELATED ARTICLES


