Homeజిల్లాలుశ్రీ సత్యసాయివిద్యార్థుల భవిష్యత్తుకు మంచి అవకాశం తల్లిదండ్రులు ఇవ్వాలి..

విద్యార్థుల భవిష్యత్తుకు మంచి అవకాశం తల్లిదండ్రులు ఇవ్వాలి..

- Advertisement -

కే.సాయి ప్రసాద్
విశాలాంధ్ర ధర్మవరం:: విద్యార్థుల భవిష్యత్తుకు మంచి అవకాశం తల్లిదండ్రులు ఇవ్వాలి అని అక్షర సుధా నవోదయ, మోడల్ స్కూల్ కోచింగ్ సెంటర్ నిర్వాహకులు కే. సాయిప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా పట్టణంలో జవహర్, నవోదయ, మోడల్ స్కూల్, ఆరవ తరగతి ప్రవేశ పరీక్షలకు గాను మంచి శిక్షణ ఇవ్వడం జరుగుతోందని తెలిపారు. ఇప్పటికే మా కోచింగ్ ద్వారా వందలాదిమంది విద్యార్థులు మంచి ఫలితాలను సాధిస్తూ నవోదయ, మోడల్, జవహర్లాంటి ప్రభుత్వ వసతి గృహాలలో మంచి చదువును కొనసాగిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం కూడా విద్యకు ఎంతో ప్రాధాన్యత ఇస్తోందని, గ్రామీణ, పట్టణ ప్రాంత వాసులకు సరి అయిన అవగాహన లేకపోవడం వల్ల ఇటువంటి అవకాశాలను జారవిడుచుకుంటున్నారని తెలిపారు. ఇటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకున్నప్పుడే కుటుంబంలోని పిల్లలు మంచి విద్యతోపాటు చక్కటి భవిష్యత్తు, ఉజ్వలమైన ఉద్యోగము లభిస్తుందని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు