Homeజిల్లాలుశ్రీ సత్యసాయిపారిశుద్ధ్య సమస్యను పరిష్కరించిన ఆరోగ్యశాఖ మంత్రి

పారిశుద్ధ్య సమస్యను పరిష్కరించిన ఆరోగ్యశాఖ మంత్రి

- Advertisement -

విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణములో రెండవ రోజు ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ పర్యటన విజయవంతంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా గాంధీ నగర్ లో పారిశుద్ధ్య సమస్య తీవ్రంగా ఉందని అక్కడి ప్రజలు తెలపడముతో, అధికారుల ద్వారా రెండు గంటల్లోనే ఆ సమస్యను పరిష్కరించడం జరిగింది. గాంధీనగర్ వాసులు మాట్లాడుతూ రైల్వే గేట్ సమీప ప్రాంతంలో చెట్లు చెత్తాచెదారం పేరుకుపోవడం వల్ల దుర్వాసన వ్యాపించి దోమల తీవ్రత పెరగడం వల్ల తాము అనేక అనారోగ్య సమస్యలకు గురవుతున్నామని తెలిపారు. అంతేకాకుండా కుటుంబంలో ఉన్న చిన్న పిల్లలు వృద్దులు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారని వారు తెలిపారు. సమస్యను విన్న మంత్రి సత్య కుమార్ యాదవ్ రెండు గంటలలోపు అధికారుల ద్వారా అక్కడికి జెసిబి వాహనాన్ని పంపించి చెత్తను పూర్తిగా తొలగింప చేశారు. ఈ ప్రాంతంలో పార్కును ఏర్పాటు చేస్తామని వారు ప్రజలకు హామీ ఇచ్చారు. మంత్రి మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యానికే తొలి ప్రాధాన్యత అని, ఏ చిన్న సమస్య తలెత్తినా వెంటనే దాన్ని పరిష్కరించేందుకు తనతో పాటు అధికారులు కూడా కృషి చేస్తారని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు ,మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు