విశాలాంధ్ర – జేఎన్టియు ఏ: జేఎన్టీయూలో రతన్ టాటా ఇన్నోవేషన్ సెంటర్ అతి త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో అన్ని విధాలా ఏర్పాట్లను సత్వరమే పూర్తి చేయాలని జిల్లా ఇంచార్జ్ జిల్లా కలెక్టర్ , రతన్ టాటా ఇన్నోవేషన్ సెంటర్ డైరెక్టర్ శివ్ నారాయన్ శర్మ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం అసిస్టెంట్ కలెక్టర్ సచిన్ సహార్ తో కలిసి అనంతపురం నగరంలోని జేఎన్టీయూ అడ్మిన్ బిల్డింగ్ లో ఏర్పాట్లను పరిశీలించారు. ఇంచార్జ్ జిల్లా కలెక్టర్ ఇప్పటివరకు జరిగిన పనుల గురించి సమీక్షించారు.
ముఖ్యంగా బిల్డింగ్ సెంటర్ పరిసరాలను ను పరిశుభ్రంగా ఉంచేలా చూడాలని విద్యార్థులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏవైనా పెండింగ్ పనులు ఉంటే వేగవంతంగా పూర్తి చేయాలని , నిర్మాణంలో నాణ్యత , విద్యార్థుల తరగతి గదులు, కాన్ఫరెన్స్ హాల్, ఇతర గదులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సెంటర్ ఓ.ఎస్. డి .దీప్తి, ఆర్.అండ్.బి. ఎస్.ఈ మురళీకృష్ణ, డిఈ వి.రాజగోపాల్, జిల్లా స్కిల్ డెవలప్మెంట్ అధికారి ప్రతాపరెడ్డి, ఉద్యాన శాఖ డిడి ఉమాదేవి, పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ శ్రీనివాస్, ఆర్.అండ్.బి జెఈ బాల కాటమయ్య, హార్టికల్చర్ అధికారి రత్నకుమార్ పాల్గొన్నారు.
రతన్ టాటా ఇన్నోవేషన్ సెంటర్ లో ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ నారాయన్ శర్మ
- Advertisement -
RELATED ARTICLES


