Homeజిల్లాలుశ్రీ సత్యసాయిపాఠశాల విద్యార్థుల భోజన సౌకర్యార్థం ప్లేట్ల వితరణ

పాఠశాల విద్యార్థుల భోజన సౌకర్యార్థం ప్లేట్ల వితరణ

- Advertisement -

విశాలాంధ్ర- ధర్మవరం : పట్టణంలోని శ్రీ గణేష్ మునిసిపల్ ఉన్నత పాఠశాల, సుందరయ్య నగర్ నందు చదువుతున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజన సౌకర్యార్థం పాఠశాల (2013-2014 బ్యాచ్) కు చెందిన పూర్వ విద్యార్థులు జి. మహేశ్వర రెడ్డి, ఎన్. నరేష్, డి. సాయి కుమార్ లు పాఠశాల విద్యార్థులకు సుమారు 12వేల రూపాయల విలువగల 200 ప్లేట్స్ వితరణ ఇచ్చినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు డా. రామకృష్ణ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ పూర్వ విద్యార్థులు వారు చదివిన పాఠశాల అభివృద్ధికి సహకరించడం అభినందనీయమని, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు వారిని అభినందించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధికి భవిష్యత్తులో కూడా తమ వంతు సహకారం తప్పకుండా అందిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు లక్షుమయ్య, రాంప్రసాద్, రామకృష్ణ, రామాంజినేయులు, ఓబులేసు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు