విశాలాంధ్ర -ధర్మవరం : పట్టణంలో ఎన్జీవో హోమ్ లో టౌన్ మహాసభలు సోమవారం ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఐ జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్ , చేనేత,చేతి వృత్తిదారుల రాష్ట్ర అధ్యక్షులు జింకా చలపతి హాజరయ్యారు. సిపిఐ టౌన్ నూతన కమిటీ సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ముసుగు మధు అధ్యక్షతన టౌన్ కార్యవర్గం ఎన్నుకోవడం జరిగింది. టౌన్ కార్యవర్గ సభ్యులు అంతా కలిసి ఏకగ్రీవంగా పట్టణ కార్యదర్శిగా 2,వ సారి పూలశెట్టి రవికుమార్ ని ఎన్నుకోవడం జరిగింది. అలాగే రెండోసారి . సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శిగా ఎర్రంశెట్టి రమణ ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. శ్రీనివాసులును నూతన సహాయ కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది. టౌన్ కార్యవర్గ సభ్యులుగా వెంకటస్వామి, వెంకటనారాయణ, రాజా,చెన్నంపల్లి శ్రీనివాసులు, శ్రీధర్, ఆదినారాయణ, శ్రీనివాసులు, వేణుగోపాల్, లక్ష్మీనారాయణ, తాజుద్దీన్, మసూద్, ఈశ్వర్,జనార్ధన్ లలితమ్మ,లింగమ్మ, తదితరులను ఎన్నుకోవడం జరిగింది. అనంతరం నూతన కమిటీని అందరూ ఘనంగా సన్మానించారు. నూతన కమిటీ వారు మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం సిపిఐ ఆధ్వర్యంలో పోరాడుతామని తెలిపారు.
సిపిఐ నూతన కమిటీకి అభినందన వెల్లువలు
- Advertisement -
RELATED ARTICLES


