సిపిఐ జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్ పిలుపు
చేనేత చేతి వృత్తిదారుల రాష్ట్ర అధ్యక్షులు జింకా చలపతి
విశాలాంధ్ర ధర్మవరం;; ధర్మవరం నియోజకవర్గ సిపిఐ జిల్లా మహాసభలు ఈనెల 31 వ తేదీన నిర్వహించబడే కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా స్థానిక ఎన్జీవో హోం లో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ తో పాటు చేనేత చేతి వృత్తి దారుల రాష్ట్ర అధ్యక్షులు జింకా చలపతి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అనంతరం సమావేశంలో పలు విషయాలను చర్చించిన అనంతరం,ధర్మవరంలో రెండవసారి ధర్మవరం నియోజకవర్గ సిపిఐ కార్యదర్శిగా ముసుగు మధుని ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కాటమయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు కుల్లాయప్ప, సిపిఐ పట్టణ కార్యదర్శి రవి, పట్టణ సహాయ కార్యదర్శి రమణ, శ్రీనివాసులు, బత్తలపల్లి మండల కార్యదర్శి వెంకటేష్, చేనేత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి వెంకటస్వామి వెంకటనారాయణ చెన్నంపల్లి శ్రీనివాసులు, యువజన సంఘం జిల్లా అధ్యక్షులు సకల రాజ, ముదిగుబ్బ మండల కార్యదర్శి శ్రీనివాసులు, తాడిమర్రి మండల కార్యదర్శి లక్ష్మీనారాయణ, రామకృష్ణ, దాసు, సన్న పెద్దన్న, దళిత హక్కు పోరాట సమితి రామకృష్ణ, మహిళా సమైక్య లలితమ్మ, లింగమ్మ, రమీజా, తదితరులు పాల్గొన్నారు.


