Homeజిల్లాలుశ్రీ సత్యసాయిరేషన్ డీలర్ పై గ్రామస్తుల ఆగ్రహం

రేషన్ డీలర్ పై గ్రామస్తుల ఆగ్రహం

- Advertisement -

రావులచెరువు పంచాయితీలోని ఎర్రగుంటపల్లికి చెందిన డీలర్ చెన్నారెడ్డి పై జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సస్పెండ్ వేటు వేసిన డీఎస్ఓ వంశీకృష్ణారెడ్డి
విశాలాంధ్ర ధర్మవరం;; ఈనెల రెండవ తేదీ శుక్రవారం మండల పరిధిలోని ఆర్ ఎర్రగుంటపల్లి రేషన్ షాపులో 35 కిలోల బియ్యం వేయాల్సి ఉండగా 30 కిలోలే పంపిణీ చేయడంతో లబ్ధిదారులు డీలర్ చెన్నారెడ్డి తో వాగ్వివాదం అయిన సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో రెవెన్యూ అధికారులు విచారణ నిమిత్తం ఆర్ ఎర్రగుంటపల్లి లోని రేషన్ షాప్ లో మొత్తంగా లబ్ధిదారుల ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. ఈ విచారణలో ఐదు కిలోలు తక్కువ వేయడం వాస్తవమేనని జిల్లా పౌర సరఫరా శాఖ అధికారి వంశీ రెడ్డి తెలిపారు. తదుపరి ఆ డీలర్ షాపులో స్టాక్ ఎంత ఉంది? ఎంతవరకు పంపిణీ చేశారు? రోజువారి రిజిస్టర్లు రాస్తున్నారా? లేదా అన్న విషయాలను పగడ్బందీగా విచారణ చేపట్టారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో వచ్చిన వాస్తవాలు నిజమేనని వారు తెలియజేస్తూ స్వయంగా చెన్నారెడ్డి రాజీనామా ఇవ్వడంతో వీఆర్వో కేశవాకు ఇన్చార్జ్ అప్పజెప్పడం జరిగిందని తెలిపారు. తదుపరి వెంటనే కార్డుదారులకు రేషన్ పంపిణీ చేయాలని తాము ఆదేశించడం జరిగిందని తెలిపారు. ఈ డీలర్ షిప్ భావన పేరు మీద డీలర్ షిప్ ఉండగా నామినీగా చెన్నారెడ్డి నిర్వహిస్తున్నారని తెలిపారు. తదుపరి భావన రిజైన్ చేయడం జరిగిందని తెలిపారూ. చెన్నారెడ్డి సోషల్ మీడియాలో స్వయంగా 5 కేజీలు తక్కువగా ఎమ్మార్వో ఇవ్వమన్నాడు అన్నది అవాస్తవమని వారు స్పష్టం చేశారు. అధికారుల మీద తప్పుడు ప్రచారాలు చేస్తే మరింత కఠిన చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ నిత్యావసర సరుకుల పంపిణీని ఇకముందుట ఇలాంటి ఘటనలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుందని, ఇందులో భాగంగా ఎమ్మార్వోలకు తగిన ఆదేశాలు కూడా ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ధర్మవరం సిఎస్డిటి చెన్నకేశవ నాయుడు, ముదిగుబ్బ సి ఎస్ డి టి మునుస్వామి, గురు ప్రసాద్, వీఆర్వో మధుసూదన్ రెడ్డి, కార్డుదారు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు