విశాలాంధ్ర – సీతానగరం: రైతుల ఆర్ధిక అబివృద్ధికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తాం అని వంగలపూడి సొసైటీ చైర్మన్ మద్దిపాటి సుజీరాజు అన్నారు. గురువారం మండలంలో వంగలపూడి గ్రామ సొసైటీకి నూతన త్రీ సభ్య కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. దీనిలో ఛైర్మెన్ గా మద్దిపాటి సుజీరాజు, చైర్ పర్సెన్స్ గా ముత్యం విజయలక్ష్మి, మద్దంశెట్టి వీర వెంకట్రావు బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ రైతులకు సొసైటీ నుండి ప్రభుత్వం అందించే అన్ని పధకాలను రైతులకు అందించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని అన్నారు. రైతుల ఆర్థిక అభివృద్ధికి అవసరం అయ్యే అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని అన్నారు. రైతులకు అన్ని సమయాలలో అందుబాటులో ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు గెడ్డం తిమ్మరావు, పెందుర్తి అచ్యియ్య, గద్దె వెంకటకృష్ణ చౌదరి (నల్లి), నీరుకొండ శ్రీను, సర్పంచ్ సంగన చినపోసియ్యతో, వలవల రాజా, కొంచా భాస్కరరావు, సొసైటీ సి ఈ ఓ పంతం సూర్యా నారాయణ, తదితరులు పాల్గొన్నారు.
రైతుల ఆర్ధిక అభివృద్ధికి కృషి చేస్తాం
- Advertisement -
RELATED ARTICLES


