విశాలాంధ్ర- దేవరపల్లి-:స్థానిక శ్రీ చైతన్య పాఠశాలలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ముందుగా వందేమాతరం గీతాలాపనతో ప్రారంభమై త్రివర్ణ పతాకావిష్కరణ జరిగింది. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు శ్రీమతి వినూత్న గారు జాతీయ జెండాను ఆవిష్కరించి విద్యార్థులను ఉద్దేశించి ఈరోజు మనమందరం ఇక్కడ సమావేశం కావడానికి ప్రధాన కారణం ఎంతోమంది తమ ప్రాణాలను లెక్కచేయకుండా త్యాగం చేసిన త్యాగమూర్తులను స్మరించుకోవడం కోసం. మనదేశంలో కుల, మత, వర్గ భేదాలు లేకుండా జరుపుకునే అతిపెద్ద జాతీయ పండుగ ఇది.
మన దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు సుమారు 200 సంవత్సరాలు మనల్ని బానిసలుగా హింసించారు. అప్పుడు మన జాతీయ నాయకులు గాంధీ, బోస్, సర్దార్ వల్లభాయ్ పటేల్ మొదలైన ఎంతోమంది వీరులు వారి ప్రాణాలను లెక్కచేయకుండా పోరాటం చేస్తే చివరికి 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం వచ్చిందని తెలియజేశారు. ఈ దేశం నాకేమిచ్చిందని కాకుండా దేశానికి నేనేమి చేయాలి అని ప్రతి ఒక్కరూ ఆలోచించాలని తెలియజేశారు.
విద్యార్థులు దేశభక్తి గీతాలాపనలతో, నృత్యాలతో ఎంతో కోలాహలంగా సాగిన ఈ కార్యక్రమంలో ఎ. జి. ఎం శ్రీ పార్థసారథి, కోఆర్డినేటర్ శ్రీ రామారావు
శ్రీ చైతన్య పాఠశాలలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
- Advertisement -
RELATED ARTICLES


